
Pushpa 2: అల్లు అర్జున్‌ను ఎలా నిందిస్తారు? పుష్ప 2 ప్రీమియర్స్‌లో మహిళ మృతిపై రామ్ గోపాల్ వర్మ
పుష్ప-2 ప్రీమియర్స్ లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి(35)తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. ఇది వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక పుష్ప…