
చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మూడో ద్వీపం (ఐలాండ్) రెడీ అయింది. సముద్ర దీవుల్లో ఉండే విధంగా తయారు చేసిన మూడో ఐలాండ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. టీఎస్‌టీడీసీ ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. ఇందులో మొత్తం 22 కాటేజీలుండగా, అందులో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఈ కాటేజ్‌లలో మరో ప్రత్యేకత…