
NT Awards: టీవీ9 కు అవార్డుల పంట.. న్యూస్ టెలివిజన్ అవార్డ్స్‌లో 71 అవార్డ్స్ కైవసం.. వెబ్‌సైట్‌కు కూడా!
ప్రేక్షకులకు అత్యంత వేగంగా, కచ్చితమైన సమాచారం అందించాలని..టీవీ9 తపిస్తుంది. అందుకోసం ప్రతిరోజూ కృషి చేస్తుంది. ప్రతి వార్తనూ అద్భుతంగా మీకు ప్రెజెంట్ చేయాలని ఆరాటపడుతుంది. ఆ ప్రయత్నంలో లభించే అవార్డులు.. జాతీయ స్థాయిలో వరించే పురస్కారాలు.. టీవీ9కు మరింత ఉత్సాహాన్నిస్తాయి. తాజాగా టీవీ9ను ప్రతిష్టాత్మక NEWS TELEVISION అవార్డులు వరించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో..టీవీ9 నెట్‌వర్క్ 71 NT అవార్డులను కైవసం చేసుకుంది. వాటిలో అత్యధికంగా 21 అవార్డులను సొంతం చేసుకుని.. జాతీయ వేదికపై జయకేతనం…