Newborn: అయ్యో దేవుడా! వారం రోజుల పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
లక్నో, నవంబర్ 3: కళ్లు కూడా తెరవని 7 రోజుల పసికందు పట్ల కన్నవాళ్లు అమానుషంగా ప్రవర్తించారు. ఓ వంతెన పై నిలబడి కిందకు అమాంతం విసిరేశారు. అయితే బిడ్డ నేరుగా కిందపడిపోకుండా ఓ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. చెట్టుపై నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన శిశువును కాపాడారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో రెండు నెలల క్రితం అంటే ఆగస్ట్ 26న…