Champions Trophy: బాంబుల భయం.. ఉలిక్కిపడ్డ న్యూజిలాండ్‌ క్రికెటర్లు! పాకిస్థాన్‌ అంటే ఆ మాత్రం ఉంటది! వీడియో

Champions Trophy: బాంబుల భయం.. ఉలిక్కిపడ్డ న్యూజిలాండ్‌ క్రికెటర్లు! పాకిస్థాన్‌ అంటే ఆ మాత్రం ఉంటది! వీడియో


పాకిస్థాన్‌.. ఓ ఐసీసీ ఈవెంట్‌ను హోస్ట్‌ చేసిన చాలా కాలం అయిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లి క్రికెట్‌ ఆడాలంటేనే అన్నీ జట్లు భయపడేవి. అలా కొన్నేళ్లుగా ఆ దేశానికి ఏ టీమ్‌ కూడా వెళ్లలేదు. దాంతో పాకిస్థాన్‌ తమ మ్యాచ్‌లను యూఏఈ వేదికగా ఆడేది. దాంతో పాకిస్థాన్‌లోని స్టేడియాల్లో గడ్డి మొలిచి, శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి జట్లు ధైర్యం చేసిన పాకిస్థాన్‌లో సిరీస్‌లు ఆడటం మొదలు పెట్టాయి. దాంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ వాళ్లకు అనుమతి ఇచ్చింది. కానీ, టీమిండియా మాత్రం పాకిస్థాన్‌ వెళ్లలేదు. అయినా కూడా మిగతా దేశాలు వచ్చిన తమ దేశంలో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత క్రికెట్‌ ఆడటం, ఓ మెగా ఐసీసీ ఈవెంట్‌ జరుగుతుండటంతో పాకిస్థాన్‌ క్రికెటర్లు, క్రికెట్‌ బోర్డు సభ్యులు, అభిమానులు అంతా హ్యాపీగా ఉన్నారు. మళ్లీ పాకిస్థాన్‌లో క్రికెట్‌ బతుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత చేసినా.. పాకిస్థాన్‌ అంటే ఉండే ఆ భయం మాత్రం ఇంకా క్రికెటర్లను వెంటాడుతూనే ఉంది. గతంలో ఓ సారి పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గ్రౌండ్‌లోనే హెలికాప్టర్‌ను దింపి, క్రికెటర్లను తరలించారు. ఆ సీన్స్‌ ఇప్పటికీ క్రికెట్‌ అభిమానులు మర్చిపోలేరు, అలాగే శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే ఉలిక్కిపడతారు. తాజాగా న్యూజిలాండ్‌ క్రికెటర్లు కూడా బాంబులు పడుతున్నాయో అని భయపడ్డారు. అది కూడా ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ కోసం బరిలోకి దిగుతున్న కొన్ని క్షణాల ముందు న్యూజిలాండ్‌ క్రికెటర్లతో పాటు మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చిన పాక్‌ అభిమానులు కూడా భయపడ్డారు.

అందుకు కారణం.. మ్యాచ్‌ స్టార్ట్‌ అయ్యే సమయంలో ఇరు దేశాల జట్లు తమ తమ జాతీయ గీతాలను ఆలపిస్తున్న సమయంలో పాకిస్థాన్‌ జాతీయ జెండా రంగులను రిలీజ్‌ చేసుకుంటూ స్టేడియం పై నుంచి కొన్ని ఎయిర్‌ క్రాఫ్ట్‌లు వెళ్లాయి. పెద్ద ట్రోర్నీ ప్రారంభం అవుతుండటంతో ప్రారంభ వేడుకల్లో భాగంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. అయితే మ్యాచ్‌ స్టార్ట్‌ అయ్యే సమయంలో మరోసారి ఎయిర్‌ క్రాఫ్ట్‌లు వచ్చాయి. కానీ, ఈసారి సడెన్‌గా పెద్ద సౌండ్‌ వచ్చింది. దీంతో బ్యాటింగ్‌కు దిగేందుకు రెడీ అవుతున్న న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వె బాంబులు పడుతున్నాయి ఏమో అని భయపడి కిందికి వంగాడు, అక్కనే ఉన్న మరో ఇద్దరు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత లేదు లేదు అవి ఉగ్రవాదుల విమానాలు కాదు, ప్రభుత్వ విమానాలే అని కూల్‌ అయ్యారు. ఆ సౌండ్‌ వచ్చిన సమయంలో న్యూజిలాండ్‌ క్రికెటర్లతో పాటు స్టేడియంలో ఉన్న పాకిస్థాన్‌ అభిమానులు కూడా భయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పాకిస్థాన్‌ అంటే ఆ మాత్రం భయం ఉంటది అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *