Chiranjeevi: పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!

Chiranjeevi: పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!


బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా మంగళవారం(ఫిబ్రవరి 11) బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మెగాస్టార చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదే సందర్బంగా తన పొలిటికల్ రీ ఎంట్రీపై వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ‘నేను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారు. ‘పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు. ఏంటీ? అటువైపు ఏమైనా వెళ్తాడా?’ అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్‌ పెట్టుకోవద్దు. జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటాను. సినీరంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు నా సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా’ అని కుండబద్దలు కొట్టేశారు చిరంజీవి.

బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఫుల్ స్పీచ్.. వీడియో



.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *