Chiranjeevi: విశ్వక్సేన్ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్తున్నావన్నారు? లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

Chiranjeevi: విశ్వక్సేన్ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్తున్నావన్నారు? లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి


విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్, గ్రూపులపై తన దైన శైలిలో స్పందించారు. ‘నేను విశ్వక్ సేన్ ఫంక్షన్ కు వెళ్తున్నాను అంటే.. అతడు ఫంక్షన్ కు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. విశ్వక్ అవతలి వాళ్లు అంటే బాలకృష్ణ, తారక్ అంటాడు కదా. అలాంటి హీరో ఫంక్షన్ కు వెళ్తావా అని నన్ను అడిగారు. ఏ బాలయ్య, తారక్ అయితే నా మీద ప్రేమ ఉండకూడదా అని నేను అడుగుతున్నాను. మా ఇంట్లో మా అబ్బాయికి సూర్య అంటే ఇష్టం. అలాగని మేము కలిసి భోజనం చేయట్లేదా. ఇదీ అంతే. ఇండస్ట్రీలో హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకునేవాళ్ళు. కానీ హీరోల కారణంగా నెల్లూరులో నాకు తెలిసిన ఇద్దరు సొంత అన్నదమ్ములు కూడా కొట్టుకొన్నారు. ఒకరేమో ఎన్టీఆర్ ఇంకొకరు నాగేశ్వరరావు అభిమానులు. నేను హీరో అయిన తర్వాత హీరోల మధ్య సఖ్యత ఉండాలని. మద్రాసులో ఉండే హనీ హౌస్ లో ప్రతి ఈవెంట్ కు ఒక పార్టీ అరేంజ్ చేసే వాడిని తెలుగు తమిళ ఇండస్ట్రీలో నుంచి అందరు హీరోలను ఆర్టిస్టులను దానికి ఆహ్వానించే వాడిని. అందుకే ఈరోజు కూడా నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ అందరం కలిసికట్టుగా ఉన్నాం.

‘అందరికీ ఒక రకమైన భోజనం రుచించదు అలాగే హీరోలు కూడా అంతే.. అందరికీ ఒకరి మీదే అభిమానం ఉండాలని రూల్ లేదు. మనకు ఫ్యాన్ బేస్ పెరగాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి అంతేకానీ మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడమో.. ఒకరిని ఒకరు దూరం చేసుకోవడం వల్ల రాదు.. మా ఇంట్లో ఇంతమంది హీరోలము ఉన్నాము.. అందరం కలిసి మెలిసి ఉంటాం.. ఈరోజు పవన్ కళ్యాణ్ కనిపించగానే అందరూ గోల పెడుతున్నారు దానికి నేను గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది దానికి నేను చాలా గర్విస్తాను. ఒకసారి సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు.. ఇండస్ట్రీలో సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి.. ఒక సినిమా ఆడితే వందల వేలమంది కార్మికుల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉంటారు. ఇండస్ట్రీలో అందరూ ఒక కుటుంబ సభ్యుల ఉన్న రోజున అందరూ ఆనందంగా ఉంటారు.

‘త్వరలోనే నేను అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నాను.. సమ్మర్ లో అది మొదలు కాబోతుంది.. సినిమా చాలా బాగా వస్తుంది అని నమ్మకం ఉంది.. మా కాంబినేషన్లో ఫుల్ కామెడీ ఎంటర్టైన ర్ రాబోతుంది’ అని అన్నారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ .. ఫుల్ వీడియో..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *