ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, చెడు జీవనశైలి కారణంగా నేటి యువత మానసిక ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. ఆఫీసుల్లో పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితాల్లోని సమస్యల కారణంగా ప్రజలు మానసికంగా సతమతమవుతున్నారు. ఇది మనకు తెలియకుండానే క్రమంగా ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అధ్యయనాలు సైతం నిరూపిస్తున్నాయి. ఇలాంటి వారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సిగరెట్లకు అలవాటుపడుతుంటారు. ఈ రకమైన నిరంతర ధూమపానం వ్యసనానికి దారితీస్తుంది. ఎందుకంటే కొంతమంది రోజుకు 5-7 సిగరెట్లు తాగుతారు. మరికొందరు 10 కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతారు. మరి సిగరెట్లు కాల్చడం వల్ల నిజంగా మానసిక ఒత్తిడి తగ్గుతుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
నిజానికి, సిగరెట్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అవి అలవాటుగా మారిన తర్వాత, వాటిని వదులుకోవడం అంత సులువు కాదు. దీనికి కారణం సిగరెట్లలోని నికోటిన్. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. సిగరెట్ తాగినప్పుడు, నికోటిన్ శరీరంలో డోపమైన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చిన తర్వాత కొన్ని క్షణాలు సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు. కానీ నికోటిన్ ప్రభావాలు తగ్గడం ప్రారంభించిన వెంటనే ఆ వ్యక్తి మళ్ళీ అశాంతి, మానసిక ఒత్తిడికి గురవుతాడు.
సిగరెట్లు తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందా?
మానసిక వైద్యుడు డా. ఆస్తిక్ జోషి ఏం చెబుతున్నాడంటే.. సిగరెట్ తాగడం వల్ల కొంత సమయంపాటు మంచి అనుభూతి కలుగుతుందనేది వాస్తవమే. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా సిగరెట్లు కాల్చే అలవాటు క్రమంగా మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే నికోటిన్‌ను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆందోళన, నిరాశ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
ధూమపానం ఎందుకు సులువుగా వదలలేరంటే..?
సిగరెట్లలోని నికోటిన్ వ్యసనంగా మారుతుంది. అందువల్ల చాలా కాలంగా ధూమపానం చేస్తున్నవారికి దానిని మానేయడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ధూమపానం మానేయడానికి ప్రయత్నించినప్పుడు, శరీరంలో నికోటిన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా చిరాకు, కోపం, అనేక ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో వారు ధూమపానం మానేయాలనుకున్నా మానలేరు. ఇందుకు వైద్యుల వల్ల చికిత్స తీసుకుంటే వేగంగా మానేయవచ్చు.
మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇలా చేయండి
- రోజువారీ నడక, వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయాలి
- లోతైన దీర్ఘ శ్వాస మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- నిద్ర లేవడానికి, పడుకోవడానికి సరైన సమయం నిర్ణయించుకోవాలి. దీన్ని రోజూ అనుసరించాలి.
- పగటిపూట బాగా నిద్రపోవాలి.
- స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. మీ సమస్యలను పంచుకోవాలి.
- ఖాళీ సమయంలో పుస్తకాలు చదవాలి. లేదా మీకు ఇష్టమైన పనులు చేయడానికి ప్రయత్నించాలి.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.