లవంగం శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని శ్వాసనాళాల సమస్యలకు సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు, ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యలను తగ్గించడంలో లవంగాల నీరు ఉపయోగపడుతుంది. ఉదయం ఈ నీరు తీసుకుంటే గొంతులో ఉన్న కఫం కరిగి ఊపిరి తీసుకోవడం తేలికపడుతుంది.
లవంగం వాడటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ బలంగా మారుతుంది. రోజూ ఉదయం తీసుకునే లవంగాల నీరు పుల్లటి త్రేన్పులు తగ్గించి గ్యాస్, ఉబ్బసం లాంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరచి ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
లవంగంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల వల్ల శరీరానికి రక్షణ వ్యవస్థ బలంగా మారుతుంది. లవంగాలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల వైరస్ లు, బ్యాక్టీరియా లాంటి హానికర సూక్ష్మజీవులపై శరీరం పోరాడే శక్తిని పొందుతుంది. ఇది సాధారణంగా వచ్చే సీజనల్ ఇన్ ఫెక్షన్ లను రాకుండా ఆపడంలో సహాయపడుతుంది.
రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించాలనుకునే వారు ఉదయం ఖాళీ కడుపుతో లవంగాల నీరు తీసుకోవచ్చు. ఇది శరీరంలోని ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో షుగర్ లెవెల్ ను సహజంగా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు లవంగాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. లవంగాల్లో ఉండే సహజ రసాయనాలు శరీరంలోని కొవ్వు కణాలపై ప్రభావం చూపి వాటిని కరిగించడంలో తోడ్పడతాయి. ఇది మెటబాలిజం వేగాన్ని పెంచి శరీర బరువు తగ్గేలా చేస్తుంది.
లవంగాల్లో ఉండే కొన్ని పోషకాలు ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్లను తొలగించి కాలేయం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు సమతుల్యంగా పనిచేస్తాయి.
లవంగాన్ని సరిగ్గా వాడితే అది ఇంటి మందుగా మారుతుంది. అయితే దీన్ని రోజూ తీసుకునే ముందు లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఉపయోగించాలంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా స్పందించదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)