దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీనాయక్. ఇక ఆయన మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో సైనికుడు మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆయన అన్నారు. ఈ మేరకు తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు.
దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/QGtIAxMjug
— N Chandrababu Naidu (@ncbn) May 9, 2025
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల సీఎం చంద్రబాబు స్పందించారు. భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఎక్స్ వేధికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు ‘జైహింద్’ అంటూ రిప్లై ఇచ్చారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం ‘జైహింద్.. న్యాయం జరిగింది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత సైన్యం చర్యలను అభినందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..