ఢిల్లీ పర్యటనలో బిజీబిజీ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కేంద్రమంత్రి జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లతో భేటీ అయ్యారు. మొదటగా జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో అరగంటపాటు సమావేశం అయ్యారు. తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చూడాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్-జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ.. 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు.
జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా 63 వేల మెట్రిక్ టన్నులు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్ టన్నులు.. రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందన్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియాలో తెలంగాణకు కోటాను పెంచాలని సీఎం కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి శ్రీ @JPNadda గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
❇️వానా… pic.twitter.com/eIT5Dq4G1j
— Telangana CMO (@TelanganaCMO) July 8, 2025
జేపి నడ్డాతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ ఆమోదించిన 596 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని రేవంత్ కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (#ZISC) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @PiyushGoyal గారిని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్లో పీయూష్ గోయల్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమై… pic.twitter.com/Q3X6OJ5CXh
— Telangana CMO (@TelanganaCMO) July 8, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.