Cricket:క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. ఆస్పత్రికి తరలింపు.. వీడియోలు వైరల్

Cricket:క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. ఆస్పత్రికి తరలింపు.. వీడియోలు వైరల్


బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భ‌యాన‌క సంఘ‌ట‌న చోటు చేసుకుంది. శుక్రవారం (జనవరి 3)న టోర్నమెంట్‌లోని ఏడవ మ్యాచ్ దర్బార్ రాజ్‌షాహి, చిట్టగాంగ్ కింగ్స్ జంట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో దర్బార్‌ రాజ్‌షాహీ జట్టు షబ్బీర్‌ హొస్సేన్‌, షఫీవుల్‌ ఇస్లామ్‌ క్యాచ్‌ తీసుకుంటుండగా పరస్పరం ఢీకొన్నారు. దీంతో షబ్బీర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాసేపు కదల్లేకపోయాడు. ఫిజియో వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి పరిశీలించారు. గాయం తీవ్రత చూసి వెంటనే స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు. చిట్టగాంగ్ కింగ్స్ బ్యాటింగ్‌లో 14వ ఓవర్‌లో షబ్బీర్, షఫీల్ మధ్య ఈ అనుకోని సంఘటన జరిగింది. సోహగ్ ఘాజీ వేసిన బంతిని ఉస్మాన్ ఖాన్ స్వీప్ షాట్ ఆడాడు. అతని బ్యాట్‌ అంచుకు తగిన బంతి స్క్వేర్ లెగ్ దిశలో గాలిలోకి వెళ్లింది. షార్ట్ ఫైన్ లెగ్ వద్ద షఫీల్, బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద షబ్బీర్ ఇద్దరూ క్యాచ్ కోసం పరుగులు తీశారు. ఒకరినొకరు చూసుకోకుండా క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి ఢీకొన్నారు. దీంతో షబ్బీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ, అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ 5 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

కాగా దర్బార్ రాజ్‌షాహీకి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఢీకొనడంతో ఉస్మాన్ ఖాన్ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు దీని తర్వాత అతను కేవలం 48 బంతుల్లో తుఫాను సెంచరీని పూర్తి చేశాడు. చిట్టగాంగ్ కింగ్స్‌కు ఓపెనింగ్ చేసిన ఉస్మాన్ 198 స్ట్రైక్ రేట్‌తో 62 బంతుల్లో 123 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 13 ఫోర్లు, 6 సిక్సర్ బాదాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా, చిట్టగాంగ్ జట్టు 20 ఓవర్లలో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇవి కూడా చదవండి

ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దర్బార్ రాజ్‌షాహీ జట్టు మొత్తం 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్‌లో చిట్టగాంగ్ 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు దర్బార్ రాజ్‌షాహీ జట్టు 3 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

బీపీఎల్ టోర్నీలో..

కాగా ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లోనూ చోటు చేసుకుంది. క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో డేనియ‌ల్ సామ్స్‌, కామెరాన్ బాన్‌క్రాప్ట్‌లు పరస్పరం ఢీకొన్నారు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

బిగ్ బాష్ లీగ్ లోనూ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *