Chennai Super Kings vs Kolkata Knight Riders, 25th Match: ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తొలిసారి ఐపీఎల్ 2025లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. శివం దూబే 31 పరుగులు చేసి స్కోరును 100 దాటించాడు.
కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. చెన్నై తరపున విజయ్ శంకర్ 29 పరుగులు చేసి రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి 16 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ 15 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయారు.
ఐపీఎల్‌లో చెపాక్ మైదానంలో చెన్నై అత్యల్ప స్కోరు చేసింది. అంతకుముందు, 2019లో ముంబైపై ఆ జట్టు 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏ మైదానంలోనైనా చెన్నై చేసిన అత్యల్ప స్కోరు 79. 2013లో ముంబైపై ఈ స్కోర్ చేసింది.
ఇరు జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, MS ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రోవ్‌మాన్ పావెల్, లువ్నిత్ సిసోడియా, అనుకుల్ రాయ్.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: మతీషా పతిరనా, జామీ ఓవర్‌టన్, దీపక్ హుడా, షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..