Cucumber Seeds: కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!

Cucumber Seeds: కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!


Cucumber Seeds: కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!

దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. దోసకాయ గింజలు బరువు తగ్గడానికి గొప్ప మార్గం. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. దాంతో మీరు ఈజీగా బరువు తగ్గగలుతారు. అందుకే దోసకాయ, దాని విత్తనాలను ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

దోసకాయ గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక చెంచా దోసకాయ గింజలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ గింజలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దోసకాయ గింజల్లో కాల్షియం,ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

దోసకాయ గింజలను చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, తాజాగా ఉంచుతాయి. దీని పేస్ట్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల మచ్చలు, ముడతల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. దోసకాయ గింజల్లో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. దోసకాయ గింజలు డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *