D Gukesh: 17 రోజులపాటు ఫైనల్.. తగ్గేదేలే అన్న చెన్నై చిన్నోడు.. గుకేష్ ప్రైజ్‌మనీ తెలిస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే

D Gukesh: 17 రోజులపాటు ఫైనల్.. తగ్గేదేలే అన్న చెన్నై చిన్నోడు.. గుకేష్ ప్రైజ్‌మనీ తెలిస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే


D Gukesh Prize Money: సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన డి గుకేశ్ విజేతగా నిలిచాడు. చైనాకు చెందిన దిన్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ చరిత్ర సృష్టించాడు. 14 గేమ్‌ల ఈ మ్యాచ్‌లో గుకేశ్ అవసరమైన 7.5 పాయింట్లు సాధించి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత.. గత 10 ఏళ్లుగా ఈ విజయం కోసం కలలు కంటున్నానని, ఎట్టకేలకు దానిని సాధించానని గుకేశ్ చెప్పుకొచ్చాడు. ఈ విజయం తర్వాత గుకేష్ కన్నీళ్లు పెట్టుకుని ఏడవడానికి కారణం ఇదే.

గుకేష్‌కు రూ.11.45 కోట్లు..

138 ఏళ్ల అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) చరిత్రలో ఆసియాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. క్లాసికల్ గేమ్‌లో ఒక విజయానికి రూ.1.69 కోట్లు అందనున్నాయి. అంటే, 3 గేమ్‌లు గెలిచిన గుకేశ్‌కు రూ. 5.07 కోట్లు, 2 గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు నేరుగా రూ. 3.38 కోట్లు వచ్చాయి. మిగిలిన ప్రైజ్ మనీని ఇద్దరు ఆటగాళ్లకు సమానంగా పంచారు. అంటే గుకేష్‌కు రూ.11.45 కోట్లు, లిరెన్‌కు రూ.9.75 కోట్ల బహుమతి లభించింది.

డి గుకేష్ ఎవరు?

గుకేష్ డి పూర్తి పేరు దొమ్మరాజు గుకేష్. అతను చెన్నై నివాసి. గుకేశ్ 7 మే 2006న చెన్నైలో జన్మించాడు. అతను 7 సంవత్సరాల వయస్సు నుంచి చెస్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో భాస్కర్ నాగయ్య వద్ద శిక్షణ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

నాగయ్య అంతర్జాతీయ చెస్ ఆటగాడు. చెన్నైలో హోమ్ చెస్ ట్యూటర్. ఆ తర్వాత, విశ్వనాథన్ ఆనంద్ ఆట గురించి సమాచారం ఇవ్వడంతో పాటు గుకేష్‌కు కోచింగ్ ఇచ్చాడు. గుకేష్ తండ్రి డాక్టర్ రజినీకాంత్, తల్లి పద్మ వృత్తిరీత్యా మైక్రోబయాలజిస్ట్.

ఒలింపియాడ్‌ను గెలిచిన గుకేశ్ చెస్..

ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 23 వరకు బుడాపెస్ట్‌లో చెస్ ఒలింపియాడ్ నిర్వహించారు. ఓపెన్‌, మహిళల విభాగాల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. ఓపెన్‌ కేటగిరీలో గుకేశ్‌ ఆఖరి గేమ్‌లో విజయం సాధించి భారత్‌కు విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *