Dil Raju : సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి.. పూర్తి వివరాలు ఇదిగో

Dil Raju : సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి.. పూర్తి వివరాలు ఇదిగో


Dil Raju : సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి.. పూర్తి వివరాలు ఇదిగో

డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అదే సమయంలో ఎందరో హీరోలు, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇప్పుడు మరోసారి కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు. ఈ మేరకు ఔత్సాహిక నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్ ఏర్పాటు చేశారాయన. ఈ విషయాన్ని తన నిర్మాణ సంస్థ ‘దిల్ రాజు డ్రీమ్స్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు .. ‘యాస ఒక్కటే కాదండి.. నరనరాల్లో మన గోదారోళ్ల ఎటకారంతో నిండిపోవాలండీ.. ఆయ్! దీని కోసం మేల్, ఫిమేల్ యాక్టర్స్ కావాలి. ఏజ్ లిమిట్ లేదు. అనుభవం అవసరం లేదు.. సినిమా పట్ల స్వచ్ఛమైన అభిరుచి.. ఇంకా చూస్తారేంటండీ బాబు.. ఆడిషన్స్‌కి వచ్చేయండి!!. ఇప్పుడు మీ కోసం మేమే వస్తున్నామండీ.. మన రాజమండ్రికి’ అని తెలుపుతూ ఓ నోట్ షేర్ చేశారు.

జులై 10, 11, 12 తేదీల్లో 2గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆడియన్స్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 4వ అంతస్తు.. PVR బోటిక్ రూమ్స్, తిలక్ రోడ్. రాజమండ్రి. ఫోన్: 9666438129’ అంటూ అడ్రస్ కూడా పొందుపరిచారు. మరి సినిమాల్లో నటించాలనుకునే గోదారోళ్లకు ఇది గోల్డెన్ ఛాన్స్.. మరేందుకు లేటు.. ఆడిషన్స్ కోసం రాజమండ్రి వచ్చేయండి.

దిల్ రాజు డ్రీమ్స్ క్యాస్టింగ్ కాల్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *