అమెరికాలో స్వర్ణయుగం మొదలైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారిగా ప్రసంగించారు. అమెరికా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడిందన్నారాయన. ‘అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తాం. దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యమైనదిగా మారింది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు. విద్యావ్యవస్థలో అనేక మార్పులు రావాలి. న్యాయవ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలి. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా’ అని ట్రంప్ అన్నారు.
2025 అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. గతంలో తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయని.. గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడ్డామని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసలను అరికడతామని.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ వెల్లడించారు. .దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలుంటాన్నాయన్నారు. నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ‘ధరలు తగ్గిస్తాం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడమే కాదు.. పనామా కెనాల్‌ను వెనక్కి తీసుకుంటాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి