
జపాన్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపను ఓర్ ఫిష్ అంటారు. ఇవి సుమారు 32 అడుగుల పొడవు పెరగగలవు. చాలా అరుదుగా కనిపించే ఈ చేపను గాడ్స్ మెసెంజర్ గా వీరు భావిస్తుంటారు. రిబ్బన్ లాంటి శరీరం, పొడవైన ఆకారం, వెండి పొలసులతో మెరిసిపోయే ఈ చేప మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఏ ఇద్దరిని కదిలించినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చేపలు వినాశనాన్ని సూచిస్తున్నాయా అని వారిలో ఆందోళన మొదలైంది.
2011లో ఏం జరిగింది..?
జపాన్ దేశస్థుల పురాణ గాథల ప్రకారం ఈ చేపల గురించిన ఆసక్తికర కథనాలు దాగి ఉన్నాయి. జపనీస్ జానపద కథలలో ఓర్ ఫిష్ కు “ర్యుగు నో సుకై” లేదా “సముద్ర దేవుడి రాజభవన దూత” అనే మారుపేరు ఉంది. ఈ పురాణం 17వ శతాబ్దానికి చెందిన ఈ ఓర్ ఫిష్ పైకి వస్తే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వారు నమ్ముతుంటారు. 2011లో విధ్వంసక టోహోకు భూకంపంచ సునామీకి కొన్ని నెలల ముందు జపాన్‌లోని బీచ్‌లలో అనేక ఓర్ ఫిష్‌లు కొట్టుకు వచ్చినప్పుడు ఈ నమ్మకాలు జపాన్ దేశస్థుల్లో మరింత బలపడ్డాయి. ఈ విపత్కర సంఘటన, రిక్టర్ స్కేల్‌పై 9.0 గా నమోదై విస్తృత విధ్వంసం, మరణాలకు దారితీసింది. ఇది ‘డూమ్స్‌డే ఓర్ ఫిష్’ నమ్మకాన్ని మరింత బలపరిచింది. డూమ్స్ డే అంటే రాబోయే ప్రళయం అని అర్థం.
ప్రమాదాన్ని ముందే పసిగడతాయా?
విపత్తులను ముందే అంచనా వేసేది ఓర్ ఫిష్ అనే నమ్మకం జపాన్ కే పరిమితం కాదు. ఆగస్టు 2017లో, లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం రావడానికి కేవలం ఒక రోజు ముందు, ఫిలిప్పీన్స్‌లో రెండు ఓర్ ఫిష్‌లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. అదేవిధంగా, 2013లో, కాలిఫోర్నియా బీచ్‌లలో రెండు ఓర్ ఫిష్‌లు కనిపించాయి, కానీ అవి ఎటువంటి విపత్తును కలిగించలేదు. ఈ వింతైన నమ్మకాలు ఉన్నప్పటికీ, ఓర్ ఫిష్ కనిపించడానికి, ప్రకృతి వైపరీత్యాల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సమర్థించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ సముద్రం తన గర్భంలో దాచుకున్న రహస్యాలు అనంతమైనవి.. అంతుచిక్కనివి.
వీడియోలు చూడండి
– This week, three "Doomsday Fish" were spotted along the coasts of Baja California Sur, Mexico. Known scientifically as oarfish, these creatures can grow up to 36 feet long and weigh over 441 pounds.
The appearance of the oarfish has long been linked to folklore, where… pic.twitter.com/e4pzgmHop2
—
The Informant (@theinformant_x) January 26, 2025
సైన్స్ ఏం చెబుతుంది?
ఓర్ ఫిష్ కనిపించడానికి ప్రకృతి వైపరీత్యాల మధ్య సంబంధం వివాదాస్పదమైనప్పటికీ, శాస్త్రవేత్తలు ఈ దీనిపై అనేక సిద్ధాంతాలను చెప్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం, ఓర్ ఫిష్ వంటి లోతైన సముద్ర చేపలు నీటి అడుగున భూకంప కార్యకలాపాలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి ఎందుకంటే అవి ఫాల్ట్ లైన్ల దగ్గర నివసిస్తాయి. ఇటువంటి సున్నితత్వం భూకంపానికి ముందు వాటిని ఉపరితలంపైకి తీసుకురావడానికి దారితీస్తుంది. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ సంబంధం ప్రమాదవశాత్తు జరిగిందని, శక్తివంతమైన ప్రవాహాలు లేదా అనారోగ్యం వంటి కారణాలతో ఓర్ ఫిష్ ఉపరితలంపైకి కొట్టుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2019లో అమెరికా భూకంపాల శాస్త్రం సంఘం బులెటిన్‌లో జరిగిన అధ్యయనంలో జపాన్‌లో ఓర్ ఫిష్ కనిపించడానికి, భూకంపాలు సంభవించడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నారు.