ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు అయ్యింది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకశిలనగర్‌లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా, ఈటెలతో పాటు 30 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. 126 (2), 115 (2), 352 (2), r/w 189 (2), r/w 191 (2)BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.