ఒకినావా ఆర్30 స్కూటర్ లో 1.25 కేడబ్ల్యూహెచ్ లిథియం – అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.61,998కి అందుబాటులో ఉంది.
ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో రూ.74,999కి అందుబాటులో ఉంది. దీనిలో1.25 కేడబ్ల్యూ రిమూవబుల్ లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. పూర్తిస్థాయిలో బ్యాటరీని చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సుమారు 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారికి డెల్టిక్ డ్రిక్స్ స్కూటర్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 70 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీనిలో 1.58 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్ రూ.58,490 నుంచి రూ.84,990 ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది.
హీరో ఎడ్డీ స్కూటర్ లో 30 ఏహెచ్ బ్యాటర్ ప్యాక్ ను ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా చార్జింగ్ చేయడానికి 4 నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. దాదాపు 85 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ రూ.72 వేలకు అందుబాటులో ఉంది.
అధిక రేంజ్ కోరుకునే వారికి కొమాకి ఎక్స్ జీటీ కేఎం స్కూటర్ చక్కగా సరిపోతుంది. ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 85 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.56,890 నుంచి రూ.93,045 మధ్య అందుబాటులో ఉంది.