Fake Loan Apps: డేంజర్‌ జోన్‌లో భారతీయులు.. నకిలీ రుణ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంలో ప్రపంచంలోనే అగ్రస్థానం.. సంచలన నివేదిక!

Fake Loan Apps: డేంజర్‌ జోన్‌లో భారతీయులు.. నకిలీ రుణ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంలో ప్రపంచంలోనే అగ్రస్థానం.. సంచలన నివేదిక!


ఈ రోజుల్లో నకిలీ యాప్స్‌ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. నకిలీ యాప్స్‌ వల్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడిపోతుంది. సైబర్‌ నేరగాళ్లు నకిలీ యాప్స్‌ను సృష్టించి వ్యక్తిగత డేటా దొంగిలించడంతో పాటు నిలువునా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఏజెన్సీ McAfee కీలక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం.. నకిలీ రుణ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నారని స్పష్టం చేసింది. చాలా మంది త్వరగా రుణం పొందవచ్చని భావించి వేరే వాటి వైపు చూడకుండా ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ ఈ అప్లికేషన్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ డేటాతో సహా ఎలాంటి అనుమతి లేకుండా దొంగిలిస్తాయి. అత్యంత ప్రమాదకరమైన 15 అప్లికేషన్లను 8 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని మెకాఫీ గుర్తించింది.

చాలా మంది వ్యక్తులు గూగుల్‌ ప్లే స్టోర్ నుండి యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఈ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించినప్పటికీ మెజారిటీ ఇప్పటికీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు McAfee కనుగొంది. ఇది వినియోగదారులను ఎక్కువ ప్రమాదంలో పడేస్తుంది.

ఈ యాప్‌లు ఎందుకు ప్రమాదకరమైనవి?

ఈ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వినియోగదారు యాప్‌లకు అనేక అనుమతులు ఇస్తారు. ఈ విధంగా ఈ అప్లికేషన్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లోని సందేశాలు, కెమెరా, మైక్రోఫోన్, స్థానంతో సహా అన్ని ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలవు. ఈ అప్లికేషన్‌లు వినియోగదారుకు తెలియకుండానే OTPతో సహా ముఖ్యమైన సమాచారాన్ని కూడా దొంగిలించగలవు.

అయితే ఈ యాప్‌లు యూజర్‌లు గూగుల్‌ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కూడా తెలియజేస్తాయి. అందుకే చాలా యాప్‌లు ఇప్పటికీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లను హ్యాకర్లు ప్రైవేట్ చిత్రాలను మార్ఫ్ చేయడానికి, ఇతర వినియోగదారులను బెదిరించడానికి ఉపయోగిస్తారు.

ఈ ప్రమాదకరమైన యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయో లేదో తనిఖీ చేయండి:

  • Préstamo Seguro-Rápido, seguro
  • Préstamo Rápido-Credit Easy
  • Get Baht Easy – Quick Loans
  • RupiahKilat-Dana cair
  • happily – loan
  • Money Happy – Loans Urgent
  • KreditKu-Uang Online
  • Dana Kilat-Pinjaman kecil
  • Cash Loan
  • RapidFinance
  • PrêtPourVous
  • Huayna Money
  • IPréstamos: Rápido
  • ConseguirSol-Dinero Rápido
  • ÉcoPrêt Prêt En Ligne

అదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని గూగుల్ ఇటీవల తన వినియోగదారులను హెచ్చరించింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున మోసగాళ్ళు వేగంగా వినియోగదారులను మోసగిస్తున్నారు. ఇలాంటి స్కామ్‌లలో చాలా మంది బలవుతున్నారు. మరింత భద్రత కల్పించేందుకు గూగుల్ ప్రత్యేక భద్రతా వ్యవస్థను కూడా ప్రవేశపెడుతోంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *