
అమెజాన్‌లో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ నడుస్తోంది. దీనికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. దీన్ని ప్రత్యేకత ఏమిటంటే ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంది. అంటే ఎలాంటి సభ్యత్వం అవసరం లేదు. కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. గోట్ సేల్‌లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, వైర్‌లెస్ పరికరాలు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. పవర్ బ్యాంకులు, స్మార్ట్ గాడ్జెట్‌లు, కెమెరాలు ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో అతి తక్కువ ధరకే వస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు శుక్రవారం నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వారికి ముందుగానే షాపింగ్ చేసే అవకాశం లభించింది. ఈ సేల్‌లో బంపర్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనేక పెద్ద బ్యాంకులతో జతకట్టింది. వీటిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకుల కార్డులను ఉపయోగిస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సూపర్‌కాయిన్‌లను ఉపయోగించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని యూపీఐ చెల్లింపులలపై అదనపు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటాయి.
ప్రముఖ బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్లు
ఈ సేల్ ద్వారా యాపిల్, శామ్‌సంగ్, నథింగ్ వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 16 లాంచ్ ధర రూ. 79,900.. కానీ ఈ సేల్‌లో రూ. 59,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో రూ. 29,999కు ఉండగా.. ఈ సేల్‌లో రూ. 27,999కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 3ఏ ప్రో, నథింగ్ ఇయర్ సిరీస్, సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2, నథింగ్ పవర్ 140W ఛార్జర్ అన్నీ తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో మీ హోమ్ పార్టీని గ్రాండ్‌గా చేసుకోవడానికి మంచి సౌండ్ బార్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే వీటిపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. థామ్సన్ సౌండ్ బార్ సిరీస్ రూ. 2999 నుండి ప్రారంభమవుతుంది. ఎంఐవీఐ యొక్క సౌండ్ బార్ సిస్టమ్ రూ. 5,499కే అందుబాటులోకి వచ్చింది. మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఓ లుక్కేసి నచ్చింది కొనేయండి.