కానీ, సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని నిరాశపరచింది. 'అలాంటి సినిమా మాత్రం తీయకండి బాబూ..' అంటూ చెర్రీతో సినిమాలు తీయబోయే నెక్స్ట్ డైరక్టర్లని రిక్వెస్టు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఉన్నట్టుండి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో కనిపించింది. అంత సడన్‌గా ఎందుకు ట్రెండ్ అవుతోందనే విషయాన్ని ఆరా తీస్తే, ఆడియో రైట్స్ కోసమని అర్థమైంది.
ఆడియో రైట్స్ నాన్ సీక్వెల్స్ విభాగంలో టాప్ త్రీ లో రెండు ఆల్బమ్స్ రామ్‌చరణ్ పేరుమీదున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న పెద్ది. ఇంకో మూవీ గేమ్ చేంజర్. పెద్ది కోసం ఆడియో కంపెనీ 35 కోట్లు చెల్లిస్తే, గేమ్ చేంజర్ గతంలో 32 కోట్లను కలెక్ట్ చేసుకుంది. అంతే కాదు, టాప్ మ్యూజిక్ డైరక్టర్ల కెరీర్ హయ్యస్ట్ ఆడియో రైట్స్ తోనూ రామ్‌చరణ్‌కి సంబంధం ఉందన్నది ఫ్యాన్స్ ఆనందంగా చెబుతున్న మాట.
రెహమాన్ కెరీర్లో పెద్ది ఆడియో రైట్స్ హయ్యస్ట్ ధరకు విక్రయమయ్యాయి. అటు గేమ్ ఛేంజర్ తమన్ కెరీర్లో అప్పటికి హయ్యస్ట్ అట. ట్రిపుల్ ఆర్ని మించి ఆడియో రైట్స్ అమౌంట్‌ని ఇంకే సినిమాకూ అందుకోలేదు కీరవాణి. ఇటు ఆచార్యతో మణిశర్మ కూడా కెరీర్ హయ్యస్ట్ ఆడియో రైట్స్ అందుకున్నారట.
ట్రెండింగ్‌కి ఇవి మాత్రమే కారణాలు కావు. 2025లో బిగ్గెస్ట్ ఇండియా ఓపెనర్‌గానూ రికార్డు ఉంది గేమ్ ఛేంజర్ పేరు మీద. వాటన్నిటికీ తోడు గేమ్ ఛేంజర్ పైరసీ గురించి మాట్లాడారు సూర్యదేవర నాగవంశీ. ఓవర్సీస్కి సెన్సార్‌కి పంపినప్పుడు, ఆ కాపీ ద్వారా మూవీ లీక్ అయిందనే విషయాన్ని షేర్ చేశారు నాగవంశీ. సో.. ఇన్ని విధాలా ట్రెండ్ అవుతోందన్నమాట గేమ్ ఛేంజర్.
కెరీర్ పీక్స్ మీదున్న సమయంలో మూడేళ్లు శంకర్ కి కాల్షీట్ ఇచ్చి రామ్ చరణ్ టైమ్ వేస్ట్ చేశారనే మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి నెట్టింట్లో. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి, గేమ్ ఛేంజర్ గ్లామర్ బ్యూటీ అంటూ కియారా అద్వానీ ఫొటోలను షేర్ చేస్తున్నారు.