తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను, వ్యాధిని కలిగించే క్రిములను అరికట్టడంలో సహాయపడతాయి. తిప్పతీగ రసం తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు తిప్పతీగ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.
తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యూటీఐ సమస్యలను దూరం చేస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో తిప్పతీగ సహాయపడుతుంది. తిప్పతీగతో గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల్ని ఇట్టే దూరం చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తిప్పతీగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి. దీంతో డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతాయి. తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే దగ్గు, జలుబు, ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్గా ఉపయోగించవచ్చు. తిప్పతీగ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. ఆందోళనను దూరం చేస్తుంది. తిప్పతీగ రసం తాగడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. దీంత గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసేందుకు తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను బయటకు తరిమేస్తుంది.
45 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనంగా మారుతాయి. తిప్పతీగ రసం తాగితే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం దాదాపు తొలగుతుంది. తిప్ప తీగను రసం రూపంలో తీసుకోవడంతో పలు అరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజూ తీసుకోవడం వల్ల క్రాంప్స్ నొప్పులు తగ్గుతాయి. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం తిప్పతీగ రసం మంచి ఎంపిక.