Gold and Silver Price Today: శుక్రవారం రోజు మహాలక్ష్మి లకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price Today: శుక్రవారం రోజు మహాలక్ష్మి లకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..


అంతర్జాతీయ మార్కెట్ పరిస్తితులను బట్టి దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, 90 రోజుల పాటు సుంకాలను తగ్గించడానికి అమెరికా, చైనా మధ్య కుదిరిన ఒప్పందం వాణిజ్య యుద్ధ భయాలను తగ్గించింది. అదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల రిస్క్ ఉన్న ఈక్విటీలకు పెట్టుబడిదారుల డిమాండ్ కూడా పెరిగింది. దీని కారణంగా బంగారం డిమాండ్ తగ్గింది. వారం రోజుల్లో బంగారం ధర 3 శాతం తగ్గింది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో నేటి (మే 16 వ తేదీ) శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధర ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకురూ.9,392 , 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,609లుగా ఉంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల్లో ఈ రోజు పసిడి ధర ఎలా ఉందో తెలుసుకుందాం..

హైదరాబాద్ కి ఈ రోజు 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 86090 ఉంది. మేలిమి బంగారం అయిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఈ రోజు రూ.93,92౦ ఉంది. ఇంచుమించి ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని ప్రధాన నగరాలైన వరంగల్, నిజామాబాద్, పొద్దుటూరు, రాజమండ్రి, విశాఖ, విజయవాడల్లో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మే 16 తేదీన బంగారం ధరలు

చెన్నై లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 86090గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.93920 ఉంది. దేశ రాజదాని ఢిల్లీ మినహా ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన దేశ ఆర్ధిక రాజధాని ముంబై, కోల్‌కతా, కేరళం, బెంగళూరులో కూడా కొనసాగుతున్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో మార్కెట్ మాత్రం పసిడి ధర అన్ని చోట్ల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 86240 ఉండగా.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.94070 ఉంది

దేశ వ్యాప్తంగా వెండి ధరలు:

బంగారం బాటలో నడుస్తూ వెండి ధరలు కూడా వరుసగా నాలుగో రోజు తగ్గుదల కొనసాగాయి. కిలోకు రూ.100  తగ్గి రూ.1,07,900కి చేరుకుంది. గత మార్కెట్ సెషన్‌లో వెండి కిలోకు రూ.1,08,000 వద్ద ముగిసింది.

బంగారం సంవత్సరాలుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన హెడ్జ్‌గా ఉంది. దీంతో ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడి అంటే బంగారం, వెండి అని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ధర ఆల్ టైం హైకి చేరుకున్నా వాటికి ఉన్న డిమాండ్ తగ్గడం లేదు. అయితే ఇప్పుడు ఇచ్చిన సమాచారం మా పాఠకుల ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బంగారంమ వెండి ధరలు ఈరోజే నవీకరించబడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *