బంగారం ధర కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,840కి చేరుకుంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా డబ్బులు తీసుకుని బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తాం. ఈ విధానంలో మన వద్ద భౌతికంగా బంగారం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లు అంటే డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనడం. ఈ విధానంలో మన చేతిలో భౌతికంగా బంగారం ఉండదు. కానీ డిజిటల్ రూపంలో ఉంటుంది. అవసరమైనప్పడు దాన్ని విక్రయించవచ్చు.
గోల్డ్ బెంచ్ మార్క్ ట్రేటెడ్ పథకాలనే గోల్డ్ బీఈఎస్ లు (ఈటీఎఫ్ లు) అంటారు. వీటిని ట్రేడింగ్ రోజుల్లో మార్కెట్ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంచ్ (ఎన్ఎస్ఈ), బీఎస్ఈలలో కొనుగోలు చేయవచ్చు. ఒక గోల్డ్ బీఈఎస్ యూనిట్ విలువ 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 0.01 గ్రాముల బంగారానికి సమానం. డిమెటీరియలైజ్డ్ లేదా డిజిటల్ రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. పెట్టుబడిదారులు వీటిని కొనుగోలు చేసుకోని తమ ఖాతాలో ఉంచుకోవచ్చు. ధర పెరిగినప్పుడు, డబ్బులు అవసరమైనప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుంది.
కంపెనీ స్టాక్ ల మాదిరిగానే గోల్డ్ ఈటీఎఫ్ లను మార్కెట్ సమయంలో ట్రేడింగ్ చేయవచ్చు. దీని కోసం పెట్టుబడిదారులకు డీమ్యాట్ ఖాాతా అవసరం. ఒక్క బీఈఎస్ ఈటీఎఫ్ యూనిట్ ను కొనుగోలు చేసినప్పుడు, మీరు 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 0.01 గ్రాముల బంగారంలో పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. యూనిట్లు డిజిటల్ రూపంలో ఖాతాలో జమఅవుతాయి. వాటిని అమ్మకం, కొనడం చేయవచ్చు. దీని వల్ల మరో ఉపయోగం ఏమిటంటే దొంగల భయం ఉండదు. భౌతికంగా బంగారం ఇంటిలో ఉంటే దొంగలు చోరీ చేస్తారనే భయం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లతో నిశ్చింతంగా ఉండొచ్చు. ఖాతాలోని యూనిట్లను ఎవ్వరూ దొంగిలించలేదు.
ఇవి కూడా చదవండి
లాభాలివే
- గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ ను ట్రేడింగ్ సమయంలో చాలా సులభంగా అమ్మకం, కొనడం చేయవచ్చు. వీటిలో బ్రోకరేజీ రుసుము చాలా తక్కువగా ఉంటుంది. ప్రవేశానికి రుసుం, వెళ్లేటప్పుడు చార్జీలు ఉండవు.
- ఇంటిలోని బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దాని ఏటా చార్జీలు చెల్లించాలి. డిజిటల్ రూపంలో బంగారానికి ఎలాంటి అదనపు రుసులు చెల్లించనవసరం లేదు.
- డీమ్యాట్ ఖాతాలో డిజిటల్ రూపంలో బంగారం యూనిట్లను దాచుకోవచ్చు. మార్కెట్ లో ధర పెరిగినప్పుడు విక్రయించుకోవచ్చు. ట్రేడింగ్ సమయంలో ఎప్పుడైనా లావాదేవీలు చేయవచ్చు. యూనిట్లను దాచుకున్నందుకు ఎలాంటి చార్జీలు ఉండవు.
- దుకాణంలో బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేయాలంటే కనీసం రూ.పది వేలకు పైగా పెట్టుబడి పెట్టాలి. గోల్డ్ ఈటీఎఫ్ లలో సుమారు 500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దానికి సమాన విలువ కలిగిన బంగారాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి