భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. పండగలు, శుభకార్యలకు బంగారు నగలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పసిడి ధరలు చూసి షాకవుతున్నారు జనాలు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 6న ఉదయం 7 గంటల సమయంలో దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న తులం బంగారం ధర రూ.82 వేలు దాటింది. మరీ ఈరోజు ఎంత ఉందో తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రేట్ రూ.86,250గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,060 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో మార్పులు వచ్చాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రేట్ రూ.86,250గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,060 వద్ద కొనసాగుతుంది.
ఇక హైదరాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1040 మేర పెరిరిగి రూ.86,240 వద్దకు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 పెరగడంతో తులం రేట్ రూ.79,050కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, వరంగల్ ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..