పచ్చి బఠానీలు పోషకాలకు నిలయం. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. బఠానీలలో కరిగే ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని సాధారణీకరిస్తుంది. తద్వారా మీరు గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠాణీలు ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో, శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి.
బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచుగా బఠాణీలు తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. వీటిలో ఉన్న సెపోనిన్స్ ద్రవ్యాలు క్యాన్సర్ నుంచి రక్షణనిస్తాయి. బఠాణీల్లో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి. పచ్చి బఠానీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంలో పచ్చి బఠానీలతో తయారు చేసిన వంటకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది శాఖాహారులకు ఇనుము మంచి మూలం. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.
శీతాకాలంలో బరువు తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు పచ్చి బఠానీలను మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీనిలో తగినంత పరిమాణంలో ప్రోటీన్ లభిస్తుంది. ఇది కాకుండా, పచ్చి బఠానీలలో ఇనుము, ఫోలేట్, విటమిన్ ఎ, భాస్వరం కూడా ఉంటాయి. ఇది కండరాల బలాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..