Haris Rauf: తండ్రైన పాకిస్థాన్‌ క్రికెటర్‌ హరీస్‌ రౌఫ్‌! కొడుకు ఏం పేరు పెట్టాడో తెలుసా?

Haris Rauf: తండ్రైన పాకిస్థాన్‌ క్రికెటర్‌ హరీస్‌ రౌఫ్‌! కొడుకు ఏం పేరు పెట్టాడో తెలుసా?


పాకిస్థాన్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్‌ మీడియా ఎక్స్‌ అకౌంట్‌ వేదికగా వెల్లడించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. అలాగే తన కుమారుడికి పెట్టిన పేరును కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు. తన కుమారుడికి మొహమ్మద్‌ ముస్తఫా హరీస్‌ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. కాగా, ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌ ఫేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్‌ ట్రోఫీలో వారి దారుణ ప్రదర్శనతో పాక్‌ జట్టుపై తీవ్ర విమర్శలు కురిశాయి. పేసర్‌ హరీస్‌ రౌఫ్‌పై కూడా పాక్‌ క్రికెట్‌ అభిమానులు విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఈ బాధ నుంచి ప్రస్తుతం హరీస్‌ రౌఫ్‌ని అతని చిన్నారి బిడ్డ బయటపెట్టినట్లు ఉన్నాడు. తన ఇంట్లోకి వారుసుడి రాకతో రౌఫ్‌ కుటుంబం సంబురాల్లో మునిగిపోయింది. కాగా, 2022 టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన సమయంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రెండు వరుస సిక్సులతో మ్యాచ్‌ను ములుపు తిప్పేసిన సీన్స్‌ అందరికి గుర్తుండే ఉంటాయి. ఆ సిక్సులు హరీస్‌ బౌలింగ్‌లోనే కొట్టాడు కోహ్లీ.

అప్పటి నుంచి హరీస్‌ రౌఫ్‌ భారత క్రికెట్‌ అభిమానులకు నోటెడ్‌ క్రికెటర్‌ అయిపోయాడు. రౌఫ్‌ అంటే చాలా కోహ్లీ కొట్టిన రెండు సిక్సులే భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుర్తుకువస్తాయి. అందులోనూ రౌఫ్‌ వేసిన ఆ ఓవర్‌ ఐదో బంతికి కొట్టిన స్ట్రేయిట్‌ సిక్స్ అయితే అద్భుతం. కోహ్లీ కొట్టిన ఆ షాట్‌ను ఐసీసీ షాట్‌ ఆఫ్‌ ది సెంచరీగా ప్రకటించింది. అయితే ఆ షాట్‌ను కోహ్లీ లాంటి గొప్ప బ్యాటర్‌ కొట్టడంతో తాను పెద్దగా బాధపడలేదని, కోహ్లీ కాకుండా వేరే బ్యాటర్‌ అయితే బాధపడేవాడినని, అయినా కోహ్లీ తప్ప ఆ షాట్‌ ఎవరు ఆడలేరంటూ కోహ్లీపై తన అభిమానం కూడా చాటుకున్నాడు రౌఫ్‌. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాకిస్థాన్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *