Heart Disease:Cardio Vascular Diseases In Telugu గుండె జబ్బులు – హృద్రోగములు
మానవుని శరీరములో అత్యంత ప్రాముఖ్యతను కలిగిన మరో అవయవము గుండె గుండె బలమైన కండరాలతో నిర్మితమై ఉంటుంది. కుడి ఎడమల ఊపిరితిత్తుల మధ్య ప్రధానంగా ఉండే ఈ గుండె దాదాపు ఆయావ్యక్తి యొక్క పిడికిలి సైజులో ఉంటుంది. ఛాతిలో చాల చక్కగా భద్రంగా ఉంటుంది గుండె.
బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో, సంపన్న దేశాల్లో Industrilised Societiesలో గుండె జబ్బుల వలన చాలమంది చనిపోవటము జరుగుతుంది. అలాగే ప్రతి 100 మందిలో ఒకరు Congenital deformities జన్మించిన తర్వాత, Severe abnormalities తో ప్రతి 500 వందల్లో ఒకరు బాధపడటము ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది
అయితే అత్యాధునికంగా వచ్చిన diagnostic fecilities మరియు Management skills గుండె జబ్బుల రోగులకు వరప్రసాదంగా మారి అనేక మందికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయనటములో సందేహము లేదు. చక్కని ఆహార నియమాలు, ప్రశాంత జీవనము గడపటము అనేవి చాల వరకు జబ్బుల్ని నిరోధిస్తాయి.
ఆయుర్వేదము నందు గుండెజబ్బులను 5 రకాలుగా వర్గీకరించారు. అవి వాతజ, పైత్తిక, కఫజ, సన్నిపాతజ మరియు క్రిమిజ హృద్రోగములు.
వాతజ హృద్రోగము :
ఛాతి మధ్యలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కత్తితో కోసినట్లు, మెలివేసినట్లు తీవ్రంగా ఉంటుంది. హృదయస్పందన (Heartbeat)లో హెచ్చుతగ్గులుంటాయి. రోగికి కంగారు ఎక్కువగా ఉండి మూర్ఛపోవటము కూడ జరుగుతుంది.
పైత్తిక హృద్రోగము :
ఛాతీలో మంట, ఛాతీ బరువుగా ఉండటము, నీరసము, అధికంగా చెమటలు పట్టటము, నోరు ఎండిపోవుట, మొదలగునవి కలిగి అపస్మార స్థితికి చేరును.
కఫజ హృద్రోగము :
గుండెనొప్పి శరీరమంతా బరువు, దగ్గు, తెమడ పడటము రుచి మారటము మొ||
సన్నిపాతజ హృద్రోగము:
వాతపితకఫజ హృద్రోగ లక్షణములన్నియు ఇందులో కనిపిస్తాయి.
క్రిమిజ హృద్రోగము :
ఛాతినొప్పి, ఛాతి అతి బరువుగా ఉండటము, వాంతి వచ్చినట్లుండుట, ఆకలి లేకపోవటము, తలనొప్పి మరియు పాదాలు వాచి ఉండటము మొదలగునవి గమనించవచ్చు.
సాధారణ గుండె జబ్బు లక్షణములు:
గుండెనొప్పి లేక ఛాతి యందు నొప్పి, ఈ నొప్పి కేవలము ఛాతి ఎడమభాగము లోనే కాక, ఎడమ భుజానికి ఎడమ చేతికి కూడ ప్రాకుతుంది. కొన్నిసార్లు నొప్పి కడుపు భాగంలోనికి కూడ ప్రాకుతుంది.
ఆయాసము :
పడుకుని ఉండగా ఆయాసము వస్తుంది. గుండెజబ్బులో వచ్చే ఆయాసము మనిషిని పడుకోనివ్వదు. దీనినే orthopnoea అంటారు. గుండెనొప్పి ఆయాసము లతో పాటు విపరీతంగా చెమట వస్తుంది. గుండె కొట్టుకునే వేగము పెరుగుతుంది. మెట్లు / ఎత్తు ఎక్కడము కష్టమౌతుంది. అలాగే నడిచినపుడు పనిచేస్తున్నపుడు ఆయాసము వచ్చి పనిని నిలిపివేయవల్సి వస్తుంది. శరీరములో నీరు అధికమై వాపు కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ వాపు పాఠాలపై స్పష్టంగా కనిపిస్తుంది పాదాలను వ్రేలితో నొక్కినపుడు గుంట పడుతుంది. అవి సాధారణ గుండె జబ్బు లక్షణములు.
గుండె జబ్బులో ఉపయుక్త ఔషధములు :
- నాము (అజవాయిన్) 3 గ్రాములు ఉదయము – సాయంత్రము సేవించిన అధిక కొలెస్టరాల్ నందు ఉపయుక్తముగా ఉంటుంది.
- వెల్లుల్లి (లచునా) : వెల్లుల్లి 3-6 గ్రాములు సేవించిన కొలెస్టరాల్ తగ్గుతుంది. ఇది Antarchalesherie మరియు libriolytic గుణాలు కూడ కల్గి ఉన్నట్లు పరిశోధనలో గమనించారు. గుండె జబ్బుల్లో లశునా చక్కని ఉపయుక్తమైన ఔషధము.
- హరీతకే (కరక్కాయ) 3 – 6 గ్రాములు సేవించిన Serum lipid levels తగ్గినట్లు పరిశోధనలో గమనించారు.
- పుష్కరమూలం (Inmuftracemosa) : పుష్కరమూలము మరియు గుగ్గులు (గుగ్గి లము) 3 గ్రాముల చొప్పున 3 పూటలు సేవించిన గుండెజబ్బుల్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది Ischemic heart disease నందు ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోధనల్లో గమనించారు.
- కోలపొన్న (శాలపర్టీ) : శాలపర్ణీ సమూలక్వాధము గుండె జబ్బులందు ఉప యుక్తంగా ఉంది. ఇది Bronchodilator (శ్వాసహర) హృదయోత్తజకము cardiacstimulant మరియు vasopresser గుణాలు కలిగి ఉన్నాయి. కోలపొన్న ఆల్కాహాలిక్ ఎక్స్ట్రా ట్రాక్ట్నకు Analgesic (వేధనాహర) మరియు Antipyretid (జ్వరహర) గుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో గమనించారు.
- గుగ్గులు (గుగ్గిలము) : గుగ్గులు యొక్క Oleo-resin యొక్క Petroleum – ether extract 5 diuretic () reductoin in Cholesteol (2) మరియు Anti-inflammatory (వ్రణ శోధహర) కర్మలు కల్గి ఉన్నట్లు పరిశోధనలో గమనించారు.
- అర్జున (తెల్లమద్ది – (T. Arjuna) : త్వక్ (stembark) క్వాధము గుండె జబ్బులందు ఉపయుక్తంగా ఉండును. ఇది హృదయోత్తేజకం (Cardiac Stimulant) మరియు మూత్రలము (Diuretic) గుణాలు కల్గి ఉన్నట్లు పరిశోధనలో గమనించారు.
- గన్నేరు (కరవీర) : గన్నేరు యొక్క కాండము (Stemhank) యొక్క ఆల్కాహాల్ కాట్రాక్ Heartfailure నందు ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోదనలో గమనించారు.
- కంటకారీ (నేలవాకుడు) ఆల్మాహాల్ ఎక్స్ ట్రాక్ నకు హృద్య మరియు కఫ mcreased forced of contraction of the hypodynamic heart and seificant expectorant) కర్మలున్నట్లు పరిశోధనలో గమనించారు.
- కటుక రోహిణి, మరియూ అతిమధురము (యష్టిమధు) చూర్ణాన్ని వేడినీటితో సేవిస్తే హృద్రోగము తగ్గుతుంది.
- హృతశూల (గుండెనొప్పి) యందు శృంగిభస్మము, 250 మి.గ్రా. మహావాత విద్బాంసి నీరసము 250 మి.గ్రా, మకరధ్వజము 100 మి.గ్రా. తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒక్కసారి అర్జునారిష్ఠము 25 మి.లీ. మరియు జలము (నీరు) కలిపి ఇచ్చిన హృతశూల తగ్గును. లేదా త్రైలోక్యచింతామణిరసము 125 మి.గ్రా, ప్రవాకషిష్ఠి 250 మి.గ్రా, శృంగిభస్మము 250 మి.గ్రా తేనెతో కలిపి రోజుకు 3 సార్లు అర్జునారిష్ఠములో కలిపి ఇచ్చిన ఉపయుక్తంగా ఉండును.
గుండెజబ్బుల నిరోధానికి :
- మద్యపానము మానివేయాలి.
- పాగత్రాగటము మానివేయాలి.
- పాన్ పరాగ్‌లు, గుట్కాలు మానివేయాలి.
- అధిక కోపం, చింతా పనికిరాదు.
- అధికంగా క్రొవ్వు వుండే ఆహార పదార్థములు మాని వేయాలి.
- ప్రతిరోజు నడక, ధ్యానము మొదలగునవి ఆచరించాలి.
Heart Disease:Cardio Vascular Diseases In Telugu గుండె జబ్బులు – హృద్రోగములు ఈ ఆయుర్వేద మందులు వాడే ముందు డాక్టర్ సలహాలు తీసుకోని వాడుకోవలెను.
Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి