ఈనాడు ప్రతిచోట పంచకర్మ పేరుతో మసాజ్ సెంటర్లు వెలిశాయి. కొన్ని చోట్ల అందమైన స్త్రీలతో శరీరము మొత్తాన్ని మసాజ్ చేయించి అదే పంచకర్మ అని ప్రచారము చేస్తున్నారు. అది తప్పు. మసాజ్ సెంటర్లు పంచకర్మ సెంటర్స్ కావు.
panchakarma ayurvedic treatment telugu: పంచకర్మ యొక్క గుణాలు(effect of panchakarma)
ఏవం విశుద్ధ కోవస్య కాయాగ్ని రబి వర్ధతే వ్యాధి యశ్చోపశ్యామ్మన్తి ప్రకృతిశ్చానువర్తతే॥ ఇంద్రియాని మనో బుద్ధి వర్ణశ్చాస్య ప్రసేదతి బలం పుష్టిరపత్యం వృషతా చాస్య జాయతే జరాం కృచ్చేణ లభతే చిరం జీవిత్యనామయః తస్మాత్సం శోధనం కాలే యుక్తి యుక్తం పిబేన్నరః
శోధనం వలన కోష్ఠం శుద్ధి నొందుతుంది. జాఠరాగ్ని వృద్ధినొందుతుంది.. వ్యాధులు శమిస్తాయి. శరీరం సమస్థితి(ప్రకృతి)ని పొందుతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరకాంతి, వికాసం కల్గుతుంది. బలం, శరీరపుష్టి, వీర్యవృద్ధి కల్గుతాయి. ముసలితనము త్వరగా రాదు. వ్యాధులు లేకుండా చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు, కావున శోధనాన్ని సరియైన సమయంలో యుక్త యుక్తంగా సేవించాలి. అని చెప్పబడింది.
పంచకర్మ చికిత్సా విధానం
యుర్వేద శాస్త్రంలో అన్ని రోగాలకు ఆయా చికిత్సలు చెప్పబడినప్పటికి ప్రత్యేకంగా పంచకర్మలు అనే కొన్ని ప్రత్యేక చికిత్స ప్రక్రియలు చెప్పబడినవి. ఆయుర్వేద చికిత్స క్రమంలో వీటికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఔషధములతో సాధ్యంకాని అనేకమైన మొండి వ్యాధులు, కఠినమైన, జరిలమైన జబ్బులు కూడPanchakarma పద్ధతుల(Specialities in Ayurveds) ద్వారా నయం చేయవచ్చు. ఇవి ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడినప్పటికి వీటి ఆచరణ, అనుసరణ ఎక్కువగా కేరళ రాష్ట్రంలో విశేష ప్రాచుర్యంలో ఉన్నది. అందుకే ఇది కేరళ వైద్యవిధానంగా ఎక్కువ ప్రాశస్త్యాన్ని పొందింది.
ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలలో వీటికి ఆదరణ లభిస్తుంది.. పంచకర్మలు వమనం, విరేచనం, నిరూహవస్తి, అనువాసనవస్తి నస్యకర్తు వమనం అనగా వాంతి చేయించటం. ఇది కఫదోష ప్రధానంగా ఉండే వ్యాధుల్లో ఆచరింపబడుతుంది. ఇది భుజించిన ఆహారం జీర్ణమగు సమయమున చేయిస్తాడు. ఆ సమయమున కఫ దోషము మిక్కిలి ఎక్కువగా ఉంటుంది. కనుక వమనము చేయించినచో మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రనిర్దేశం విరేచనకర్మను పిత్తదోష ప్రాధాన్య వ్యాధుల్లో ఉపయోగిస్తారు. విరేచనం చేయించిన పిత్తదోషవికారం వలన కలిగిన దోషములన్ని తొలగి ఆరోగ్యం చేకూరుతుంది.
నిరూహ, అనువాసనవస్తులు రెండును శరీరంలోని వాత దోషశమనము కొరకు నిర్దేశించబడినవి. వస్తి ప్రక్రియలో ఉపయోగించు ఔషధం యొక్క భేదముచే రెండు విధాలుగా చెప్పబడినప్పటికి రెండునూ శరీరంలో వాత దోష సంబంధం వలన కలిగిన పక్షవాతము, నరములకు సంబంధించిన వ్యాధుల్లో మిక్కిలి ప్రశస్తంగా ఉంటుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై తిరిగి ఆహారంపై కోరిక కలిగినపుడు వస్తిని ఇస్తారు.
నస్యకర్మ అను చికిత్స ప్రక్రియను శిరస్సు, మెడ యందలి రోగములకు కారణాలైన దోషతత్త్వాన్ని బయటికి వెడలించటానికి ఉద్దేశించబడినది. పంచకర్మ చికిత్సలే కాక స్నేహం. స్వేదం అను రెండు ప్రక్రియలు విశేషంగా చెప్పబడినవి. ఇవి Panchakarma చికిత్సలో భాగం కాకున్నను పంచకర్మలు ఆచరించటానికి ముందు తప్పక ఆచరించవలసిన ప్రక్రియలుగా చెప్పబడ్డాయి. అందుకే వీనిని పూర్వకర్మలు అని పిలుస్తారు. వమనం, విరేచనం మొదలగు వానిని ప్రధాన కర్మలని పిలుస్తారు. స్నేహ, స్వేదములు చేయకుండ పంచకర్మలు చేసినచో వ్యాధి ఉపశమనము బదులు క్రొత్త వైపరీత్యాలు కలుగుతాయి.
పూర్వకర్మల వలన శరీరంలోని వివిధ ప్రాంతము లందే కేంద్రీకృతమైయున్న వికృతి నొందిన వాత పిత్త కఫములు అనే త్రిదోషములు స్థానచలనం పొంది తిరిగి తమ తమ స్థానాలకు చేరుతాయి. అప్పుడు పంచకర్మల ద్వారా దోషపూరితమైన శరీరతత్త్వములను బయటకు వెడలించి శరీరం నుండి రోగ తత్త్వమును బయలు వెడలించి స్వస్థతి చేకూర్చటమే శోధన థెరపి ముఖ్య స్నేహ, స్వేదములు వికృతి పొందిన దోషములను శమింపచేసి వాటి స్థానములకు చేరుస్తాయి. స్వస్థానమునకు చేరిన దోషతత్త్వములను పంచకర్మలు బయటకు వెడలిస్తాయి, కనుక స్నేహ, స్వేదములకు పూర్వకర్మ అని మాత్రమే కాక శమన చికిత్స ప్రక్రియలు అనే పేరు కూడ ఉంది.
పూర్వకర్మలయిన స్నేహ, స్వేదముల వలన జఠరాగ్ని దీప్తి చెందుతుంది. చర్మమునిర్మలమై మృదుత్వం పొందుతుంది. అన్నంపై శ్రద్ధ కల్గుతుంది. ప్రోతస్సులు నిర్మలంగాఉంటాయి. రక్తప్రసరణ వ్యవస్థ క్రమబద్ధమవుతుంది. జడత్వం, కునికిపాటు తొలగి శరీరం తేలికయి పటుత్వం పొందుతుంది. వస్తికర్మల ద్వారా జీర్ణాశయ, పక్వాశయ,జననేంద్రియ మూత్రవహ సంస్థాగత వ్యాధులే కాక సర్వశరీరగత వ్యాధులు తొలగిసంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నస్యకర్మద్వారా కన్ను (నేత్రము), చెవులు, ముక్కు,గొంతు సంబంధ వ్యాధులు తొలగి ఆయా ఇంద్రియములకు పటుత్వం చేకూరి మంచి ఆరోగ్యాన్ని ఆయుషును కల్గచేస్తుంది.
- స్నేహనము: శరీరానికి మృదుత్వం కలిగించే ప్రక్రియను స్నేహనం అంటారు. దీనిలో వివిధ తైలములు, నెయ్యి, మొదలగు వానిని బాహ్య మరియు అభ్యంతర ప్రయోగముల ద్వారా శరీరమునకు మృధుత్వమును కలుగచేయుటమే స్నేహనము. నోరు, ముక్కు మలద్వారముల ద్వారా అభ్యంతర ప్రయోగము, అభ్యంగము, తర్పణం, పిచు, వస్తి(శిరోవస్తి), ధారా మొదలగు వానిని బాహ్య ప్రయోగము ద్వారా స్నేహనాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి చికిత్సా ప్రక్రియకు ముందు, తర్వాత కూడ స్నేహకర్మను తప్పక ఆచరించాలని ఆయుర్వేద శాస్త్రకారుల అభిప్రాయం.
స్నేహకర్మకు అర్హులు: Panchakarma ayurvedic treatment ఉద్దేశించబడినవాడు మద్యపానము,అధిక స్త్రీ సంభోగము, వ్యాయామములందు ఆసక్తి కల్గినవారు, ఎల్లప్పుడు ఏడ్చు స్వభావము కలవారు, వృద్ధులు, బాలురు, బలహీనులు, కృశించినవారు, రక్తక్షీణత గలవారు, శుక్రక్షీణత కలవారు అర్హులు.
అనర్హులు: జఠరాగ్ని మందగించినవారు, మిక్కిలి తీవ్రమైన జఠరాగికలవారు, మిక్కిలి స్థూల శరీరము కలవారు. మిక్కిలి బలహీనులు, అతిసారం, విషము, ఇతరరోగాలు, మూర్ఛ, వాంతి. అరుచి, కఫము, దప్పి, గర్భస్రావమైన స్త్రీలు స్నేహకర్మలకు అనర్హులు.
ఘృతం మొదలగు స్నేహ ద్రవ్యములను మాత్ర, కాలం, భూమి, దోషము మొదలగు వానిని అనుసరించి ఆయా విషయములకు అనుగుణంగా తయారు చేసి వివిధ రకాలైన ఆహార పదార్ధాలతో చేర్చి ప్రయోగిస్తారు. అంతే కాక వస్తి, నస్యకర్మ, అభ్యంగము, శిరోవస్తి, తర్పణం, కర్ణపూరణం, అక్షిపూరణం మొదలగు ప్రక్రియల ద్వారా కూడా ఉపయోగిస్తారు. ఈ స్నేహనమును భోజనమునము ముందు. ప్రయోగించిన అధోదేహమున జనించిన రోగాలు, భోజనానంతరం సేవించిన ఊర్ద్వ శరీరగత వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. సుకుమారులకు వృద్ధులకు, శిశువులకు, దప్పికతో ఉన్న వారికి స్నేహమును ఆహారపదార్ధములలో కలిపి ప్రయోగిస్తారు. ఈ స్నేహపానం వలన జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. మలబద్ధకం తొలుగుతుంది. శరీరమున ధాతువులకు పుష్టి, బలం కల్గుతుంది. మంచి రంగు వర్చస్సు ఏర్పడి సర్వాంగములకు పటుత్వము కల్గి దీర్ఘాయుస్సు పొందగలరు.
- స్వేదనము: ఆయుర్వేదంలో చెప్పబడిన ప్రత్యేక చికిత్స క్రమములో స్వేదన చికిత్సకు కూడ ప్రత్యేకత ఉంది. ఈ ప్రక్రియ వలన వ్యాధినుండి ఉపశమనం కల్గడమే కాకుండా శమనచికిత్సకు ముందు తప్పక ఆచరించవలసిన విధానంగా ఆయుర్వేదంలో చెప్పబడినది. ఉబ్బసం, దగ్గు, ఎక్కిళ్లు, పొట్ట ఉబ్బరము, శరీరంలో వివిధ రకాల నొప్పులు, మూత్ర సంబంధ వ్యాధులు, హెర్నియా, పక్షవాతము స్పర్శ తెలియకపోవటం, కొన్ని రకాల జ్వరాలు, ఈ స్వేదన ప్రక్రియ వలన తగ్గుతాయి.
కాని ఎక్కువగా లావుగా ఉన్నవారికి, వాంతులు విరేచనాలు, మధుమేహము, చర్మవ్యాధులు, కేటరాక్ట్, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తహీనత, పచ్చకామెర్లు, ఆకలిదప్పులతో ఉన్నవారికి, గర్భిణీస్త్రీలు, బాలింతలు, బహిష్టు అయిన స్త్రీలకు ఈ స్వేద కర్మ చేయకూడదు. విభిన్న ప్రక్రియల ద్వారా శరీరమునకు చెమట పట్టేట్లు చేయటమే స్వేదకర్మ యొక్క ఉద్దేశ్యము. శాస్త్రంలో అనేక ప్రక్రియలు చెప్పబడినప్పటికీ ఆచరణలో ఈ క్రింద చెప్పబడిన కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే అనుసరిస్తున్నారు.
- అవగాహస్వేదము: ఈ విధానము ముఖ్యంగా ఒళ్ళంతా వాతపు నొప్పులు, మూత్రసంబంధ వ్యాధులు, హెర్నియా మొదలగు వాని యందు సూచించబడినది. ఒక తొట్టిలో ఆయా రోగమును అనుసరించి శరీరము భరించగలిగినంత వేడిగా కషాయం, పాలు మొదలగు వానిని పోసి దానిలో రోగిని నిర్ణీత సమయము వరకు కూర్చోబెట్టాలి. వాతపు నొప్పుల్లో మెడవరకు మునిగేలా, మిగిలిన వ్యాధుల్లో నడుము వరకు మునిగేలా రోగిని కూర్చుండబెట్టాలి.
- ఊష్మస్వేదము: ఈ పద్ధతిలో రోగిని పడుకోబెట్టి దట్టమైన దుప్పటి కప్పి మంచం క్రింద ఒక పాత్రలో ద్రవాన్ని వేడిచేస్తూ, ఆ ఆవిరి రోగి శరీరానికి తాకేలా చేస్తారు. దీనిని ఆధునిక పరిభాషలో “స్టీబ్బాత్”గా పరిగణిస్తారు.
- ఉపనాహ స్వేదము: ఈ పద్ధతిలో నొప్పి, వాపు కలిగిన ప్రదేశంలో అవసరానుసారము తగిన మూలికలను ముద్దగా చేసి దానిని వేడి చేసి పట్టులా వేసి దానిపై గుడ్డను కాని ఆముదము మొదలగు ఆకులతో కప్పి నిర్ణీత సమయం వరకు ఉంచుతారు.
- కంబళ స్వేదము: ఈ పద్ధతి ద్వారా వేడి ద్రవములో తడిపిన దట్టమైన దుప్పటి లేదా కంబళిని రోగికి కప్పి చెమట పట్టేలా చేస్తారు.
- తాప స్వేదము: ఈ పద్ధతి ద్వారా వేడి చేసిన రాయి, ఇసుక, సీసంలాంటి పదార్థాలతో కాపటం పెడ్తారు,
- ధ్యాన స్వేదము: వరి గోధుమ మొదలగు ధాన్యములను ఉడికించి నేలపై పరచి దానిపై పలుచని గుడ్డ వేసి ఆ గుడ్డపై రోగిని పడుకోబెట్టి కంబళిని కప్పి ఉంచుతారు.
- ధార స్వేదము: దీనిలో రోగమును బట్టి ఔషధాల కషాయం కాచి ఒక పాత్రలో పోసి ధారగా శరీరమంతట నిర్ణీత సమయం వరకు పోస్తారు,
- నాడీ స్వేదము: కెటిల్ లాంటి పాత్రలో ఔషధ ద్రవ్యంపోసి దానిని వేడిచేస్తారు. కెటిల్ ట్యూబుండా వచ్చే ఆవిరిని శరీరముపై ప్రసరింపచేస్తారు.
- పత్రస్వేదము: ఒక పలుచని గుడ్డలో రోగమును అనుసరించి ఔషదయుక్త పత్రములు మూటగా కట్టి దానిని కషాయంలోగాని తైలంలోగాని వేడిచేసి కాపడం పెడ్తారు.
- పిండస్వేదము: అరవై రోజుల్లో పండే ధాన్యాన్ని పాలు. కొన్ని ఔషదాల కషాయంలో కలిపి అన్నంలో పండుతారు. ఈ అన్నాన్ని చిన్న మూటలాగ కట్టాలి. తర్వాత శరీరమంతా తైలంతో చక్కగా మర్దనచేసి ఈ అన్నం మూటలును. ఔషధుల కషాయంలో ముందుతూ వేడిగా ఉన్నప్పుడు శరీరంపై రుద్దుతారు. ఈ విదంగా నిర్ణీత సమయం వరకు అన్నం మూటలను వేడి ఔషధద్రవ్య కషాయంలో ముంచుతూ వివిధ భంగిమలలో (పద్ధతుల్లో) శరీరముపై రుద్దుతారు. ఈ ప్రక్రియ కనీసము 7,9,11,14 రోజులు వేయాలని శాస్త్రంలో చెప్పబడింది. పక్షవాతం, చచ్చువాతము, కీళ్ళనొప్పులు మొదలగు దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది అత్యంత ప్రయోజనకారిగా ఉంది ఈ విధంగా 10 రకముల స్వేదన ప్రక్రియలు వివరించబడుతూ ఆయా వ్యాధి, రోగి, వయస్సు, బలం, వ్యాధి తీవ్రతను అనుసరించి ఏవేని ఒక పద్ధతిని అనుసరించి స్వేదన ప్రక్రియ చేస్తారు. స్వేదనము వివిధములైన ఔషధయుక్త తైలములతో శరీరానికి అభ్యంగం చేసి, రోగము యొక్క తీవ్రతను బట్టి, అవసరానుసారం కొన్ని రకాల కషాయాలలో, కొన్ని రకాల తైలములు కల్పి కాని, నెయ్యి (ఘృతం) యందు కొన్ని ఔషధాలను చేర్చిగాని రోగికి త్రాగించి తర్వాత స్వేదకర్మ చేయిస్తారు. ప్రత్యేకంగా వివరించబడిన సందర్భములో తప్ప స్వేదకర్మకు ముందు స్నేహపానము చేయిస్తారు. ఈ స్వేదకర్మ వలన చర్మము మృదువుగా తయారవుతుంది. జఠరాగ్ని దీప్తి నొడుతుంది. శోధన చికిత్సలో విశిష్ట స్థానము ఇవ్వబడిన చికిత్స ప్రక్రియ వమనము(వాంతి చేయించటం). శరీరంలో రోగ కారక పదార్ధాలను బయటకు వెడలించు ప్రయత్నంనకు శోధన చికిత్స అని పేరు. ఆయుర్వేద మూల సిద్ధాంతాలయిన త్రిదోషములలో కఫదోష సంబంధాలైన వ్యాధులకు చికిత్సగా వమనకర్మ నిర్దేశింపబడినది. అనగా కేవలము కఫదోషము మాత్రమే కాక కఫము అనుబంధంగా ఉన్న పిత్త, వాత మొదలగు సందర్భములలో కూడ వమన చికిత్స సూచించబడినది. అంతే కాక కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడ కఫ సంబంధము లేకున్నను వమనం చేయమని సూచింపబడటం గమనార్హము.
Panchakarma Ayurvedic Treatment Telugu full Deatalls click hear…