Health Tips: ఈ ఆహారాలు మీ గుండె పాలిట బ్రహ్మాస్త్రాలు.. డైలీ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Health Tips: ఈ ఆహారాలు మీ గుండె పాలిట బ్రహ్మాస్త్రాలు.. డైలీ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?


ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఇది అందరినీ కబళిస్తుంది. 20ఏళ్ల యువకుడు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది.
ముఖ్యంగా గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడటం గుండెపోటు వస్తుంది. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి. కానీ సరైన సమయంలో కొన్ని అవసరమైన మార్పులు చేస్తే, ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. వెల్లుల్లి, బ్రోకలీ, పాలకూర వంటి కొన్ని సహజ కూరగాయలు గుండె ధమనులను శుభ్రంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, బ్రోకలీ యొక్క యాంటీఆక్సిడెంట్లు, పాలకూర నైట్రేట్లు కలిసి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. గుండె ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి వైద్యులు ఈ కూరగాయలను సాధారణ ఆహారంలో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తారు. ఈ కూరగాయలు తినడం గుండెపోటును నివారించడంలో ఎలా సహాయపడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వెల్లుల్లి

గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఉత్తమ సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో అల్లిసిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, ధమనులలో పేరుకుపోయిన కొవ్వును క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెపోటు, అడ్డంకి ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం మంచిది.

బ్రోకలీ

బ్రోకలీ అనేది ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కె, సీలతో సమృద్ధిగా ఉన్న సూపర్‌ఫుడ్. ఇది ధమనుల గోడలను బలపరుస్తుంది. వాటిలో మంటను తగ్గిస్తుంది. బ్రోకలీ రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బ్రోకలీని ఉడుకబెట్టుకుని తినడం లేదా సలాడ్‌లో యాడ్ చేసుకుని తినొచ్చు.

పాలకూర

పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, నైట్రేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో, కండరాలకు ఆక్సిజన్‌ను అందించడంలో, ధమనులను తెరవడంలో సహాయపడుతుంది. నైట్రేట్ శరీరంలోకి ప్రవేశించి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె అడ్డంకి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పాలకూరను కూరగా, సూప్ లేదా రసంగా తీసుకోండి.

ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు..

గుండెల్లో అడ్డంకులు ఏర్పడకుండా పూర్తిగా నివారించడం కష్టం. కానీ సరైన ఆహారం, జీవనశైలితో దీన్ని ఖచ్చితంగా నివారించవచ్చు. వెల్లుల్లి, బ్రోకలీ, పాలకూర వంటి సహజ కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *