Health Tips: నిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. వీటితో కలిపి తింటే శారీరానికి ఎంత హనికరమో తెలుసా..

Health Tips: నిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. వీటితో కలిపి తింటే శారీరానికి ఎంత హనికరమో తెలుసా..


నిమ్మకాయ తినడం శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండేందుకు చాలా మంది నిమ్మరసాన్ని తీసుకుంటారు. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ విటమిన్ సి చాలా అవసరం. నిమ్మకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ప్రతిరోజూ నిమ్మకాయ తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిమ్మ రసాన్ని అన్నంలో, సలాడ్, డ్రింక్ ఇలా రకరకాలుగా తింటారు. అయితే నిమ్మకాయతో బాగా సరిపోయే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని రకాల ఆహారాలు నిమ్మతో కలిపి తింటే శరీరంలో ప్రతికూలంగా పనిచేస్తాయి. అవి ఏమిటంటే..

బొప్పాయి: ప్రకృతిలో అనేక పండ్లు ఉన్నాయి. వీటిలో నిమ్మరసం కలిపడంతో మంచి రుచి పెరుగుతుంది. పోషకాలు కూడా పెరుగుతాయి. అయితే బొప్పాయి విషయంలో అలా కాదు. బొప్పాయి నిమ్మకాయతో కలిపి ఎప్పుడూ తినకూడని పండు. నిమ్మ, బొప్పాయి ప్రభావాలు.. పోషక విలువలు ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. అందుకే నిమ్మకాయ, బొప్పాయిని కలిపి తింటే శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని చేస్తుంది. అంతే కాకుండా బొప్పాయి, నిమ్మకాయలను కలిపి తింటే శరీరంలో బలహీనత ఏర్పడి రక్తహీనత పెరుగుతుంది.

టమోటా: నిమ్మరసం, టొమాటోలను చాట్‌లు, సలాడ్‌లు, చట్నీలలో కూడా కలిపి ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు ఆహారాలను కలిపి తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. నిమ్మకాయ-టమాటా కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మలబద్ధకం, కడుపులో భారం, ఆమ్లత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పాలతో చేసిన ఫుడ్: పాలలో నిమ్మరసం కలిపితే పాలు విరుగుతాయని అందరికీ తెలిసిందే. అదే విధంగా నిమ్మకాయను పాలు లేదా పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోకూడదు. నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ అనే ఆమ్ల పదార్థం ఉంటుంది. ఇది పాలతో పాటు, జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది అజీర్ణం, పెరిగిన ఆమ్లత్వంతో వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

పెరుగు: పెరుగుని నిమ్మకాయతో కలిపి తినకూడదు. నిమ్మ మాత్రమే కాదు ఏదైనా సిట్రస్ పండును పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరంలో హానికరమైన టాక్సిన్స్ పెరుగుతాయి, ఇది దురద, అలెర్జీ ప్రతిచర్యలు, జలుబు వంటి సమస్యలను కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *