Health Tips ప్రతి రోజు సరైన సమయంలో ఆహారం తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ ఆహారం తినాలి? ఏయే సమయంలో తినాలో తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు పూర్తి చేయడం ఉత్తమం. ఎందుకంటే మన శరీరం రాత్రివేళ అతి స్వల్పంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిగా మారుతుంది. దీని వల్ల అప్పుడు తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోతే అసిడిటీ, వాంతులు, వాయువు, లేదా పొట్ట నొప్పులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా అధిక మోతాదులో ఆహారం తీసుకుంటే రాత్రి నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల శరీరం రిఫ్రెష్ కాకుండా, అలసటగా మారి, తదుపరి రోజున పూర్తిగా చురుకుగా ఉండలేనంతగా ప్రభావితం అవుతుంది.
ఇది కూడా చదవండి: Auto News: 6 ఎయిర్‌బ్యాగులు, బెస్ట్ మైలేజీ.. ధరం కేవలం రూ. 5.79 లక్షలు.. ఎప్పుడు నం 1గా నిలుస్తున్న కారు!
ఇంకా ముఖ్యంగా రాత్రివేళ మన శరీరంలో మెటబాలిజం మందగించడంతో ఆలస్యంగా తీసుకునే ఆహారంలోని కాలరీలు పూర్తిగా ఖర్చవకుండా, కొవ్వు రూపంలో నిల్వ అయ్యే అవకాశముంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే శరీరభార పెరగడం ప్రమాదం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
రాత్రి భోజన సమయం, రక్తంలో షుగర్ స్థాయి మధ్యన గట్టి సంబంధం ఉంటుంది. తరచూ రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే, శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం ద్వారా మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని వల్ల బీపీ (రక్తపోటు), కోలెస్ట్రాల్ స్థాయి వంటి అంశాలు విరుద్ధంగా మారతాయి.
అందువల్ల, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు పూర్తిచేయడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట తేలికపాటి త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటున్నారు. భోజనం తరువాత తక్కువగా నీరు తీసుకుంటూ, కొంత నడవడం శ్రేయస్కరం. ఇలాంటి నియమాలు పాటిస్తే మధుమేహం, గుండెపోటు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొంపముంచిన మొండితనం.. ఇది కరెక్టేనా మీరు చెప్పండి
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి