Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 22, 2025): మేష రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బును, రాదనుకుని వదిలేసుకున్న డబ్బును పట్టుదలగా రాబట్టుకుంటారు. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో పని భారాన్ని సహచరులు పంచుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి, పని భారం తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. సహోద్యోగుల సహాయంతో ఉద్యోగ బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలం అవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్లో స్నేహితుల సహాయం లభిస్తుంది. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో కొందరు బంధు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలు, లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులతో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారంతో ఇబ్బంది పడతారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇష్ట మైన బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడు తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. సొంత పనుల మీద బాగాశ్రద్ధ పెట్టడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నష్టదాయక వ్యవహారాలకు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *