Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఫిబ్రవరి 25, 2025): మేష రాశి వారికి సాధారణంగా ఇంటా బయటా మీ మాటకు విలువ పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నం అయినా సఫలం అయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సాధారణంగా ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నం అయినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆఫర్ అందే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఆశిం చిన మెరుగుదల ఉంటుంది. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అధికారులు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటు లేకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను, కార్య కలా పాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు ముఖ్య మైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యాపారాల్లో లాభాలకు, లావాదేవీలకు లోటుండదు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో పనిభారంతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయ త్నమూ నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఊహించని అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు, పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక లక్ష్యాలు, బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగు తుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. అధికారులను మీ పని తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అయితే, అందుకు తగ్గట్టుగా ప్రతి ఫలాలు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అనుకున్న పనులు కొద్ది శ్రమతో అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు ఆశించిన శుభ వార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బాధ్యతలు, లక్ష్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. బంధువులతో ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *