Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మార్చి 8, 20250): మేష రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవ హారాలు అనుకూలంగా మారుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలకు చదువుల మీద కొద్దిగా శ్రద్ధ పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. షేర్ల వల్ల బాగా లాభం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవు తుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల వల్ల కలిసి వస్తుంది. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి డిమాండ్ ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు గడిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు బాగా వృద్ధి చెందుతాయి. అధికారులు కొత్త లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. కొన్ని సమస్యలు, చికాకుల నుంచి బయటపడ తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. మిత్రుల్లో కొందరు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో కొద్దిపాటి మెరుగుదల ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు. చేపట్టిన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సవ్యంగా, సానుకూలంగా సాగిపోతాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. బంధువుల విషయాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతల్ని సకాలంలో నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అంది, కొన్నిముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవ సరం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1)

రాదనుకుని వదిలేసుకున్న డబ్బును కూడా రాబట్టుకుంటారు. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసు కుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో కష్టనష్టాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి నుంచి ఉపశ మనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి తప్పకపోవచ్చు. లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. స్తోమతకు మించి ఒకరిద్దరు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు బాగాతగ్గుముఖం పడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో సంపాదన బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు బంధుమిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *