దిన ఫలాలు (జూన్ 2, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు పై అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. మిథున రాశి వారికి ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం ఆశించిన విధంగా సాగిపోతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, విలాసాల మీద, మిత్రుల మీద అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక, ఆస్తి సంబంధమైన విషయాలో సజావుగా సాగిపోతాయి. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. పెళ్ల, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవ హారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం బాగా సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధార పడతారు. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకువెడతారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రుణ సమస్యలు తగ్గి ఊరట చెందుతారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. డబ్బు తీసుకోవడం, ఇవ్వడం ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లభించడం గానీ, జీతభత్యాలు పెరగడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆశించిన శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. అదనపు పని భారం తప్పకపోవచ్చు. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ మీద అతిగా ఆధారపడ తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపు తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పని భారం బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి.