Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 3, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలం పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు బాగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు బంధువుల వల్ల సమస్యలు, చికాకులు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాద్యతలు పెరుగుతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్య మైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండు బాగా పెరుగుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కానీ, వృథా ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికార యోగం పట్టే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశముంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. రావలసిన డబ్బు కూడా సరైన సమయానికి చేతికి అందుతుంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశముంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే సూచనలున్నాయి. వ్యాపా రాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటాబయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *