దిన ఫలాలు (మార్చి 17, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని అనుకూలతలు పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రస్తుతం దశమ, లాభ స్థానాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థుల కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గ్రహాల అనుకూలత వల్ల రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. దాంపత్య, ప్రేమ జీవితాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో సజావుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా, గౌరవప్రదంగా సాగి పోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమయస్ఫూర్తితో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు వీలైనంతగా సహాయపడతారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
పంచమ స్థానం శుభ గ్రహాలతో నిండి ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
దశమాధిపతి శుక్రుడు ఉచ్ఛలో ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం హ్యాపీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానం శుభ గ్రహాలతో బలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే, అనవసర ఖర్చులు తగ్గించుకుని పొదుపులు, మదుపులు చేయడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ శుక్రుడితో పరివర్తన చెందినందువల్ల రోజంతా హ్యాపీగా సాగిపోతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాలు లాభదాయ కంగా సాగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.