దిన ఫలాలు (ఫిబ్రవరి 22, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం బాగా పెరుగే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడిపరంగా మరింతగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొందరు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన సమాచారాలు అందుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఊహించని విధంగా కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ధనపరంగా ప్రస్తు తానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం కూడా శ్రేయస్కరం. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనేక విధాలుగా ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అదనపు ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగంలో కొద్దిగా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొద్ది శ్రమతో ప్రతి వ్యవహారమూ, ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. బంధువులకు సహాయం కూడా చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గ్రహాల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ సలహాల వల్ల ప్రయో జనం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం నెలకొని ఉంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు సవ్యంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవు తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధార పడే అవకాశం ఉంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా దాదాపు సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతలుంటాయి. ఆదాయం అనేక విధాలుగా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. బంధుమిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం చాలా మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగపరంగా శుభవార్తలు అందుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు, కొత్త లక్ష్యాలను చేపట్టవలసి వస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలలో రాబడికి కొరత ఉండదు. ఉద్యోగాలలో అధికారులు అనేక విధాలుగా ప్రోత్సహిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గి ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. ఊహించని విధంగా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.