Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 30, 2025): మేష రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక సంబంధమైన ఒత్తిడేమీ ఉండకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శుభ గ్రహాల అనుకూలత కారణంగా ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, శుక్రుల బలం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయీలన్నీ వసూలవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే అధికంగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ సలహాలు వల్ల అధికారులే కాక బంధుమిత్రులు కూడా లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, రవి, బుధుల అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోయి రాబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయ మార్గాలు ఆశా జనకంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకూల గ్రహాల వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరగడానికి, ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకూల గ్రహాల వల్ల రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తారు. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జోరు తగ్గుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరిగి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం అందిస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దురలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి అనుకూలతలు పెరుగు తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగం పట్టే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందవచ్చు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రధాన గ్రహాల అనుకూలత వల్ల విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలన్నీ సానుకూలంగా పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్ప కుండా సఫలమవుతాయి. ఆర్థికపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు, రవుల అనుకూలత వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనులు చక్కబెట్టు కుంటారు. కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వినే సూచనలున్నాయి. అనవసర పరిచయాల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *