Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు అంచనాలకు మించి లాభాలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు అంచనాలకు మించి లాభాలు..12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయపరంగా సమయం బాగా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రతి ప్రయత్నమూ సంతృప్తికరంగా నెరవేరుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సం బంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. బంధు మిత్రుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయపరంగా సమయం బాగా కలిసి వస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అదృష్టాలు కలగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థికాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అష్టమ శని ప్రభావం వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీత భత్యాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో హోదాతో పాటు ప్రాభవం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సాను కూలపడతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కొందరు మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు అంది వస్తాయి. అప్రయత్నంగా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంతో పుణ్యక్షేత్ర సందర్శనకు బాగా అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. జీతభత్యాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్య మైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *