దిన ఫలాలు (జూన్ 1, 2025): మేష రాశి వారికి సోదర వర్గంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే పెరుగుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. సంపాదన బాగా పెరుగుతుంది. కుటుంబంతో విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. కొద్దిగా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా కొత్త అవకాశాలు, ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పదవీ యోగం పట్టడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వృత్తి నిపుణులకు బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు కొద్దిగా పని ఒత్తిడి, పని భారం తప్పకపోవచ్చు. సహోద్యోగులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన బంధు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తల పెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యానికి భంగం ఉండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. బంధువుల సహాయ సహకారాలతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబం వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. బంధువులతో మాట తొందర పనికి రాదు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మరింత ఉత్సాహంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. ఉద్యోగులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. ఐటి వంటి వృత్తి నిపుణులకు తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొందరు మిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. ఆర్థిక విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.