దిన ఫలాలు (ఏప్రిల్ 28, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ధన స్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, వ్యయ స్థానంలో ఉన్న లాభాధిపతి శని, ధన స్థానాధిపతి శుక్రుడి వల్ల చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలే అవకాశం ఉండదు. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, ఆర్థిక లావాదేవీల్లోనూ, ఆర్థిక వ్యవహారా ల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టవచ్చు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛలో ఉండడంతో పాటు, శని, బుధులతో కలిసి ఉన్నందు వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఖర్చుల్ని బాగా అదుపు చేస్తారు. దూర ప్రాంతపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. జీతభత్యాలుకూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు ఉచ్ఛ శుక్రుడు కూడా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. అయితే, అక్కడ శనీశ్వరుడు కూడా ఉన్నందువల్ల ఉద్యోగంలో పని భారం పెరిగి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లాభ స్థానంలోని రవి వల్ల రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వమూలక గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత వర్గాలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ పట్టడంతో పాటు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛ పట్టడం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలి స్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయానికి లోటుండదు. మదుపులు, పెట్టుబడులు విశేష లాభాలనిస్తాయి. ఉద్యోగంలో జీత భత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛలో ఉండడంతో పాటు, గురువుతో పరివర్తన చెందినందువల్ల ఆర్థికంగా బాగా బలం కలుగుతుంది. జీతాలు పెరగడం, షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడం, రావలసిన డబ్బు చేతికి అందడం వంటివి జరుగుతాయి. తోబుట్టువులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు శుభవార్త అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి రంగంలో మార్పులు జరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
గురు, శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రేమలో పడే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
పంచమంలో రవి గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో కొద్దిగా ఇబ్బందిపడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శని తృతీయంలో శుక్రుడితో కలిసి అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో ధనాధిపతి శనితో శుక్ర, బుధులు కలిసి ఉండడం వల్ల ఆదాయానికి లోటుండక పోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటాబయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
శుక్ర, గురువులతో సహా ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యయ ప్రయాసలు, శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.