Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మార్చి 19, 2025): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో, అందులోనూ ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి, అధికారుల నమ్మకం చూరగొంటారు. మిథున రాశి వారు ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సమర్థతకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ వృద్ధికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో, అందులోనూ ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. బంధువులకు సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి, అధికారుల నమ్మకం చూరగొంటారు. వృత్తి, వ్యాపా రాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు బాగా తగ్గిపోతాయి. మానసిక ప్రశాం తత లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. పిల్లల కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సమర్థతకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన డబ్బును పట్టుదలగా రాబట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. విదేశాలలో ‍స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా, సాదా సీదాగా సాగి పోతాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పనిభారం బాగా పెరుగుతుంది. బాధ్యతలను సకాలంలో, సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలతో ముందుకు వెళతారు. ముఖ్యమైన కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయి పోతుంది. వ్యాపారం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించిన బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా పురో గమిస్తుంది. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ఆశించిన పురోగతి సాధిస్తాయి. వ్యాపారాల్లో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు కొద్దిగా చక్కబడతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి ఇబ్బందులున్నా బాధ్యతలు, లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రయాణాల్లో డబ్బు వృథా అవుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు ఎంత శ్రమపడితే అంత మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *