Horoscope Today: వారికి ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఏప్రిల్ 10, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారి వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మిథున రాశి వారికి వ్యాపారాల్లో శ్రమకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఎదురు చూస్తున్న మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరగడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల్లో బాగా సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారుల అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను కొద్ది ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు పడతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. కొందరు స్నేహితుల వల్ల దండగ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. జీతభత్యాల విషయంలో అధికారుల నుంచి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. ఆదాయం బాగానే పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో డిమాండ్ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవాభిమానాలు బాగా పెరుగుతాయి. మీ పని తీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు లాభాల నిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశముంది. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అద నపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్ల మీద పెట్టే పెట్టుబడులు బాగా లాభాలనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగు తాయి. కొద్ది శ్రమతో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఇతరులకు ఉపయోగపడే జరిగే పనులు చేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందు కుంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

శని, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు ఘన విజయం సాధిస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *