దిన ఫలాలు (ఫిబ్రవరి 24, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. బాధ్యతల నిర్వహణలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కార్య కలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృథా ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఇతరుల మీద ఆధార పడకపోవడం మంచిది. పెండింగులో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికంగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్త వినే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలు గడిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. సోదరులతో రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ది చెందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కొందరు బంధుమిత్రులకు సహాయ సహ కారాలు అందిస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆశించిన శుభవార్తలు అందుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మానసికంగా ఊరట లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆర్థికంగా బాగా లాభాలు కలుగుతాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తి గత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి అంచనాలకు మించుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బాగా పని భారం ఉండే అవకాశం ఉంది. కొద్దిగా విశ్రాంతి దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలున్నా లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కొందరు చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశం ఉంది. మీ పనితీరుకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎంతో నమ్మకంతో బాధ్యతలను పెంచే అవకాశం ఉంది. పదోన్నతికి లేదా జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో శ్రమ, తిప్పట అధికంగా ఉంటాయి. అధికారులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్య మైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. హోదా పెరగడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. అద నపు సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచుకుంటారు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.