Horoscope Today: వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు


Horoscope Today: వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యో గంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. గణపతి స్తోత్ర పఠనం వల్ల శుభ ఫలితాలు కలుగు తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపా రాలు లాభ దాయకంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల సుఖ సంతోషాలు వృద్ధి చెందు తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల పరిస్థితులు అనుకూలి స్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగ మిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. సంపా దన నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వ్యయప్రయాసలతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పర వాలేదనిపిస్తుంది. సకాలంలో, సంతృప్తికరంగా ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో స్వల్పంగా లాభాలు పొందుతారు. ఆదిత్య హృదయం పఠనం వల్ల విజయాలు కలుగు తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారా లను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రోజూ విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దాదాపు పట్టుకుందల్లా బంగారం అవుతుంది. తల పెట్టిన ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. వృత్తుల్లో ఉన్నవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ది చెందుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు సర్దుమణుగుతాయి. లలితా సహస్ర నామ పఠనం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో సానుకూలతలు పెరుగుతాయి. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం ఏర్పడుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఫలించి, లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగు లకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచ నలున్నాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తరచూ సుందరకాండ పారాయణం చేయడం వల్ల విజయాలు, సాఫల్యాలు వృద్ది చెందు తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడ తారు. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా అను కూలంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. సొంత పనులు మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తరచూ వినాయకుడికి అర్చన చేయించడం చాలా మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. రాహుకేతువులకు పూజ చేయించడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరు ద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపో తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. తరచూ శివార్చన చేయడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *