Horoscope Today: వారికి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం..12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మార్చి 7, 2025): మేషం నుండి మీనం వరకు అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి రాశికి వృత్తి, ఆర్థిక, కుటుంబం, ఆరోగ్యానికి సంబంధించి జ్యోతిష్య సలహాలు ఇవ్వబడ్డాయి. మేష రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది, వృషభ రాశివారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. మిగిలిన రాశులకు కూడా వారి వారి అనుకూల, ప్రతికూలతల గురించి ఇక్కడ తెలియజేయబడింది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలను నమ్ముకోవడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగానే కలిసి వస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సవ్యంగా, సజావుగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అదనపు ఆదాయానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి కుటుంబ సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేసి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణా లకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

శుభ గ్రహాల అనుకూలత కారణంగా రోజంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో భారీగా లాభాలు అందుకుంటారు. కొందరు సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగి పోతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, కొద్దిగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఒక ముఖ్య మైన ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ముఖ్య మైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వినే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభ వార్తలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త లక్ష్యాలను, బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. పని భారం వల్ల విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలమవుతాయి. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకో కుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా కొంత వరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *